వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఓకేలోకి 2000 మంది సైనికులను తరలించిన పాక్...?

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి 2000 మంది సైనికులు తరలించింది. నియంత్రణ రేఖకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్ మరియు కోట్లీ సెక్టర్ల సమీపంలో సైనికులు ఉన్నట్టు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే పాకిస్తాన్ సైన్యాలను తరలించడంతో పరిణామాలను నిశితంగా పరీశీలిస్తున్నాయని భారత సైన్యం తెలిపింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ తమ సైన్యాన్ని తరలించడం మరింత టెన్షన్ ప్రారంభమైంది.

ఐదు రోజుల క్రితం అదృశ్యం: సరస్సులో శవంగా తేలిన ఐబీఎం ఉద్యోగిఐదు రోజుల క్రితం అదృశ్యం: సరస్సులో శవంగా తేలిన ఐబీఎం ఉద్యోగి

జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని కల్గించే ఆర్టీకల్ తొలగింపు తర్వాత పాకిస్థాన్ ,భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలను సృష్టించేందుకు పాకిస్థాన్ ఇప్పటికే పలు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో భారత భద్రత బలగాలు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాయి. మరోవైపు కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా తీర్చి దిద్దేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది. కశ్మీర్‌లో హింస చెలరేగుతోందంటూ పలు ఆరోపణలు చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటీ ఆధారాలు కూడ లేకపోవడంతో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టలేక పోయింది.

pakistan has moved a brigade consisting of over 2,000 troops into pok,

దీంతో కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీసుకుంటున్న చర్యలు వైఫల్యం కావడంతో పలువురు పాకిస్థాన్ నేతలు ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటికైన ఇమ్రాన్ ఖాన్ పీవోకేపై దృష్టి సారించాలని పలువురు సూచించారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఓ వైపు ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూనే మరోవైపు పీవోకేను పదిలపరుచుకునే చర్యలకు పూనుకున్నట్టు సమాచారం. మరోవైపు అక్టోబర్ నవంబర్ నెలలో పాకిస్థాన్ యుద్దానికి దిగుతుందంటూ పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
pakistan has moved a brigade consisting of over 2,000 troops to the Bagh and Kotli sectors near Poonch area of Pakistan-occupied Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X