భారత్ కు పాకిస్థాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. రెండు ఆప్షన్స్ ఇస్తూ కీలక ప్రకటన
ఏప్రిల్ 22 న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నది జలాల పంపిణీ నిలిపివేత ఒకటి. నీళ్లను పాకిస్థాన్ కు మళ్లించకుండా నిలిపివేయడంతో ఇప్పటికే ఆ దేశం భారత్ కు చాలాసార్లు లేఖలు రాసింది. అయినా భారత్ వాటిని పట్టించుకోలేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తమకు అప్పగిస్తేనే నీళ్లను విడుదల చేస్తామని కుండ బద్దలు కొట్టింది. ఈ క్రమంలో మరోసారి భారత్ కు పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది.
సింధూ నది జలాల్లో తమకు రావాల్సిన వాటాను వెంటనే విడుదల చేయాలని మరోసారి పాకిస్థాన్ డిమాండ్ చేసింది. లేదంటే యుద్ధానికి సిద్దం అవ్వాలని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) అధినేత బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్లను ఆపి భారత్ వ్యవహరిస్తున్న తీరు అనైతికం, అన్యాయం అని భుట్టో పేర్కొన్నారు. భారత్ టెర్రరిజాన్ని రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు.

సింధూ నదీ జలాల్లో తమకు న్యాయమైన వాటా ఉందని ఆ నీటిని వెంటనే విడుదల చేయాలని పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) అధినేత బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని భారత్ రాజకీయంగా వాడుకుంటోందన్నారు. అంతర్జాతీయంగా పాకిస్థాన్ కు రావాల్సిన నిధులు, పెట్టుబడులను భారత్ అడ్డుకుంటోందని మండిపడ్డారు. తక్షణమే నీటిని విడుదల చేయాలని లేదంటే యుద్ధాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని భుట్టో హెచ్చరించారు. ఈ మేరకు పాకిస్థాన్ పార్లమెంటులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
" భారత్ కు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. న్యాయంగా మా వాటా మాకు ఇవ్వండి లేదా సింధూ నదిలో భాగమైన ఆరు ఉపనదుల నీటిని మేము వినియోగించుకుంటాం. ఇండస్ వాటర్ ట్రీటీ ముగిసిందని భారత్ పేర్కొనడం అన్యాయం. యూఎన్ ఛార్టర్ ప్రకారం ఈ నీటిని భారత్, పాకిస్థాన్ ఉపయోగించుకోవాలి. కానీ భారత్ అలా చేయడం లేదు. ఇది అనైతికం, అన్యాయం" అని భుట్టో పార్లమెంటులో ప్రస్తావించారు.
ఇటీవల సింధూ నది జలాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతా.. పాకిస్థాన్ కు నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భుట్టో వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. మరోవైపు పాకిస్థాన్ ను FATF గ్రే లిస్టులోకి పంపించేందుకు భారత్ కుట్ర పన్నుతోందని భుట్టో మండిపడ్డారు. ఇదే జరిగితే పాకిస్థాన్ కు ప్రపంచ దేశాల నుంచి నిధులు నిలిచిపోతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications