పాకిస్థాన్ లో భూకంపం.. జనాలు పరుగులు
పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.6 గా నమోదైంది. అక్టోబర్ 5 ఆదివారం రాత్రి రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు స్పష్టం చేసింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
అలాగే శనివారం కూడా భారత కాలమానం ప్రకారం 01:59 గంటలకు పాకిస్థాన్ లో తొలుత భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5 నమోదైంది. ఈ భూకంపం 10 కి.మీ లోతులో ఉందని అధికారులు తెలిపారు. ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ఈ క్రమంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఆదివారం సాయంత్రం మరొకసారి భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటన చేసింది. ఈ ఏడాదిలో కరాచీలో దాదాపు 30 భూకంపాలు సంభవించాయి. ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. ఇక నిరంతర ప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి.
ఇక అక్టోబర్ 2న బుధవారం పాకిస్తాన్ లోని కరాచీలో 3.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. పాకిస్థాన్ మెటిరిలాజికల్ డిపార్ట్ మెంట్ ప్రకారం.. బుధవారం ఉదయం 9:34 గంటలకు మాలిర్ కు వాయువ్యంగా ఏడు కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. 10 కి. మీ లోతులో భూకంపం కేంద్రీకృతం అయి ఉంది.
ఇక సెప్టెంబర్ లో అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా 2,200 మందికి పైగా మృతి చెందారు. మరో 3,000 మందికిపైగా గాయపడ్డారు. 6.0 తీవ్రతతో సంభవించిన భూకంప తాకిడికి గ్రామాలకు గ్రామాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అన్ని రకాలుగా సాయం చేస్తామని హామి ఇచ్చారు. అప్గానిస్థాన్ భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత్ అత్యవసర మానవతా సాయాన్ని పంపించింది.

మరణించిన వారి సంఖ్య 1400 దాటింది. మరో 3,000 మందికిపైగా గాయపడ్డారు. 6.0 తీవ్రతతో సంభవించిన భూకంప తాకిడికి గ్రామాలకు గ్రామాలే ధ్వంసమయ్యాయి. తాలిబన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అన్ని రకాలుగా సాయం చేస్తామని హామి ఇచ్చారు. అప్గానిస్థాన్ భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత్ అత్యవసర మానవతా సాయాన్ని పంపించింది.












Click it and Unblock the Notifications