పాకిస్థాన్ లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. వీడియో వైరల్

చెడుపై మంచి సాధించిన విజయాన్నే విజయ దశమిగా చెబుతుంటారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో విజయదశమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి.. తొమ్మిది అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది. శక్తి స్వరూపిణి, జగజ్జననిని, దుర్గామాతను నవరాత్రుల్లో విశేషంగా పూజిస్తారు.

ముఖ్యంగా కోల్ కతా, మైసూరు, ఉత్తర భారత్ లోని గుజరాత్ ఈ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పాకిస్థాన్ లోని కరాచీలో హిందువులు ఘనంగా నవరాత్రి వేడుకలను జరుపుకుంటున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సరిహద్దులు దాటినా హిందువులు తమ భక్తి, సంస్కృతిని మరచిపోలేదని ఈ దృశ్యాలు తెలియజేస్తున్నాయంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Pakistan karachi area Navaratri celebrations held on a grand scale in Pakistan video goes viral

ఈ నవరాత్రి వేడుకలు కరాచీలోని రత్నేశ్వర్ మహదేవ్ ఆలయంలో జరిగినట్లు ముంజీ గల్హీయూన్ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో పోస్టు చేశారు. అలాగే ఓ టెక్స్ట్ కూడా పెట్టారు. నవరాత్రి డే 1: శివ్ మందిర్ కరాచీ, పాకిస్థాన్, దిస్ ఈజ్ నాట్ ఇండియా.. దిస్ ఈజ్ పాకిస్థాన్ నవరాత్రి అని క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియోలో భక్తులు ఆలయంలో గుజరాతీ సంప్రదాయ నృత్యం గర్బా ఆడుతూ కనిపించారు. మాతా రాణి విగ్రహం చుట్టూ చేరి కోలాటాలతో నృత్యాలు చేస్తూ తమ ఆనందం, సంబరాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ పిల్లలు చాలా ఉత్సాహంగా పండుగను జరుపుకుంటున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. జై మాతా జై మాతా అనుకుంటూ నినాదాలు చేశారు. ఈ నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఈ వేడుకలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో పెద్ద పెద్ద శబ్దాలతో టపాసులు కాల్చుతూ సేమ్ భారత్ లో ఎలాగైతే దసరా నవరాత్రుల్ని జరుపుకుంటారో అలాగే పాకిస్థాన్ లోనూ నిర్వహించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+