ఒకేరోజు 39 మంది ఉగ్రవాదులు హతం! ఆత్మాహుతి దాడికి ప్రతీకారమా?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: సింధు ప్రావిన్స్ లోని సెహవాన్ లో ఉన్న సూఫీ ప్రార్థనామందిరం లాల్ షహబాజ్ కలందర్ లోకి ఉగ్రవాది చొరబడి.. ఆత్మాహుతి దాడికి పాల్పడి 76 మందిని బలితీసుకున్న తెల్లారే.. పాకిస్తాన్ భద్రతా దళాలు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించి మొత్తం 39 మంది ఉగ్రవాదులను కాల్చి చంపాయి.

ఒక్క దక్షిణ ప్రావిన్సులోనే 18 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పారామిలటరీ సింధ్ రేంజర్స్ శుక్రవారం వెల్లడించింది. సింధ్ లోని సూపర్ హైవే వద్ద సైనిక కాన్వాయ్ పైన కాల్పులకు తెగబడిన మరో ఏడుగురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు రేంజర్స్ పేర్కొంది.

Pakistan Kills Over 24 Militants in Crackdown After Lal Shahbaz Qalandar Shrine Blast

కరాచీలో మంఘోపిర్ వద్ద జరిపిన సోదాల్లో 11 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు తెలిపింది. మరోవైపు ఖైబర్-ఫక్తున్ఖవాలో పోలీసులు ప్రత్యేకంగా జరిపిన ఆపరేషన్ లో మరో 11 మంది తీవ్రవాదులు హతమైనట్లు ఓ సీనియర్ భద్రతాధికారి వెల్లడించారు.

తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనిచేస్తోందనీ.. మున్ముందు మరింత విస్తృతంగా దాడులు జరుపుతామని ప్రకటించారు. కేవలం వారం రోజుల్లోపు ఎనిమిది సార్లకుపైగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడడంతో పాకిస్తాన్ ప్రభుత్వం సోదాలు జరపమని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Islamabad: Pakistani security forces on Friday killed more than 24 militants in a nationwide crackdown, a day after an ISIS suicide bomber blew himself up in Sufi shrine of Lal Shahbaz Qalandar in Sindh’s Sehwan, claiming 76 lives. Paramilitary Sindh Rangers on Friday said they killed 18 terrorists in overnight operations in the southern province. According to Rangers, seven terrorists were killed in a shootout after they attacked a convoy of the paramilitary troops on the Super Highway near Kathor, Sindh.
Please Wait while comments are loading...