యుద్ధానికి ముందే పాకిస్తాన్ హ్యాండ్సప్..? ఆ ఒక్క తప్పిదంతో..!

పహల్గాంలో పాకిస్తాన్ అనుకూల తీవ్రవాదులు భారత పౌరుల్ని పొట్టనపెట్టుకున్న ఘటన తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరిస్ధితి రోజురోజుకూ దిగజారుతోంది. అదే సమయంలో భారత్ పై దాడి చేస్తామంటూ బీరాలు పలుకుతున్న దాయాది దేశం తాజాగా పహల్గాం దాడి తర్వాత చేసిన ఓ తప్పిదం శాపంగా మారుతోంది. భారత్ పై దాడి సంగతి అటుంచి శ్రీలంకలా దివాళా తీయకుండా ఉంటే చాలన్న పరిస్ధితి వచ్చేస్తోంది. ప్రపంచ బ్యాంక్ అందించిన సాయం సైతం ఆవిరైపోయేలా చేస్తున్న ఆ తప్పిదం ఏంటో ఓసారి చూద్దాం..

భారత్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతీకారం తప్పదన్న భయంతో పాకిస్తాన్ తమ గగనతలాన్ని మూసేసింది. ముఖ్యంగా భారత్ నుంచి విమానాలు తమ గగనతలంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. దీంతో భారత్ తీవ్రంగా నష్టపోతుందని భావించింది. అయితే పాకిస్తాన్ చర్య వల్ల భారత్ కు జరిగే నష్టం కంటే ఆ దేశానికి జరుగుతున్న నష్టం ఎక్కువని తేలిపోయింది. ముఖ్యంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ కు ఈ నిర్ణయం శరాఘాతంగా మారిపోయింది.

108 2

భారత విమానాలు తమ గగనతలం లోకి రాకుండా పాకిస్తాన్ విధించిన నిషేధంతో భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతోంది. పహల్గాం దాడి తర్వాత భారత్ తో పాటు ఇతర దేశాల విమానాలు కూడా పాకిస్తాన్ గగనతలంపై నుంచి రాకపోకలు సాగించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో భారత్ తో పాటు ఆయా దేశాల నుంచి ఓవర్ ఫ్లైట్ ఛార్జీలు రాకుండా పోయాయి. భారత్ కు చెందిన ఎయిర్ ఇండియాతో పాటు పలు అంతర్జాతీయ విమాన ఆపరేటర్లు, ఎయిర్ ఫ్రాన్స్, బీఏ, ఎమిరేట్స్ , లుఫ్తన్సా వంటి విదేశీ ఆపరేటర్లు కూడా పాక్ గగనతలాన్ని వద్దనుకున్నాయి. దీంతో ఆయా దేశాల నుంచి వచ్చే విదేశీ కరెన్సీ ఆగిపోయింది.

Take a Poll

పాకిస్తాన్ కు తాజాగా ప్రపంచ బ్యాంక్ 108 మిలియన్ డాలర్ల సాయం విడుదల చేసింది. మార్చిలో బెయిల్ అవుట్ ప్యాకేజీ కింద 2 మిలియన్ డాలర్లు ఇచ్చింది. అయినా ఇప్పుడు పాకిస్తాన్ గగనతలం మూసివేత నిర్ణయంతో భారీగా విదేశీ కరెన్సీని కోల్పోతోంది.. ఇదే పరిస్ధితి కొనసాగితే బారత్ పై యుద్దం సంగతి తర్వాత ముందు ఆ దేశానికి రోజు గడవడమే కష్టంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాక్ మౌనంగా ఉండిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+