Pakistan: పాకిస్థాన్ మెడపై వేలాడుతున్న 18 బిలియన్ డాలర్ల కత్తి..
పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వడ్డీ రేటును 300 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) 20 శాతానికి పెంచింది. ఇది అక్టోబర్ 1996 తర్వాత అత్యధికం.మార్చి 2న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో SBP ఈ నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 2023లో పాకిస్తాన్ CPI ద్రవ్యోల్బణం సంవత్సరానికి (YoY) 31.5 శాతానికి పెరిగింది. అయితే ప్రధాన ద్రవ్యోల్బణం పట్టణాలలో 17.1 శాతానికి పెరిగింది. పాక్ లో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగియి. పాలు, మాంసం, గోధమ పిండి ధరలు భారీగా పెరిగాయి. ఇది ఇలా ఉంటే
ఇరాన్‌తో పాకు కుదుర్చుకున్న గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయ్యే అవకాశం లేదు.

దీంతో ఒప్పందం ఉల్లంఘించినట్లై ఇరాన్‌కు 18 బిలియన్ డాలర్ల మేరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పాక్ పబ్లిక్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ ఆ దేశ నేషనల్ అసెంబ్లీకి తెలిపింది. ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది.

పాక్ లో డీజిల్, పెట్రోల్ ధరలు కూడా రూ.300కు చేరుకున్నాయి. తాజాగా అక్కడ పసిడి ధరలు ఆకాశన్నంటాయి. పాకిస్థాన్ లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2 లక్షలకు పైనే పలుకుతోంది.












Click it and Unblock the Notifications