• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాకిస్తాన్ మంత్రి షాకింగ్ కామెంట్స్: మోడీ పుట్టిన రోజును గర్భ నిరోధక దినంగా అభివర్ణన!

|

ఇస్లామాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఎంతగా ధ్వేషిస్తోందో తెలయజేసే ఉదంతం ఇది. నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాధినేతలకు ఆయనకు శుభాకాంక్షలను తెలియజేస్తుండగా.. పాకిస్తాన్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. పిచ్చి ప్రేలాపనలు చేసింది. నరేంద్ర మోడీ పుట్టిన రోజును గర్భ నిరోధక దినంగా అభివర్ణించింది. ఈ మేరకు ఆ దేశ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ చౌధురి ఓ ట్వీట్ చేశారు. తాను చేసిన ట్వీట్ కు మోడీ బర్త్ డే అంటూ హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ఫవాద్ చౌధురి చేసిన ఈ ట్వీట్ పట్ల పాకిస్తానీయులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

నరేంద్ర మోడీ మంగళవారం 69వ పుట్టిన రోజును జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కన్నతల్లి హీరా బెన్ ను కలిసి ఆమె ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. తల్లితో కలిసి భోజనం చేశారు. అంతకుముందు- మోడీ నర్మదా జిల్లాలోని పర్యటించారు. కెవాడియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద నర్మదా నదీమత్లలికి హారతి ఇచ్చారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారతీయ జనతాపార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలతో ముంచెత్తారు.

Pakistan Minister Fawad Chaudhry Posts a Tweet on PM Narendra Modi’s Birthday, Gets Trolled by Netizens

మోడీ జన్మదినం పట్ల విషం చిమ్మింది పాకిస్తాన్ మాత్రమే. ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గ సభ్యుడి హోదాలో ఫవాద్ చౌధురి ఈ ట్వీట్ చేశారు. మోడీ పుట్టిన రోజును గర్భ నిరోధక దినంగా అభివర్ణిస్తూ ఆయన చేసిన ట్వీట్ పట్ల నెటిజన్లు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్ కొన్ని నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారింది. ప్రధానిపై పొరుగు దేశం ఎంతగా విషాన్ని చిమ్ముతున్నదో ప్రపంచానికి చాటి చెప్పింది. చివరికి పాకిస్తాన్ లోనూ ఫవాద్ పట్ల వ్యతిరేకత ఎదురైంది. మన దేశానికి చెందిన పలువురు నెటిజన్లు, ట్విట్టరెటీలు పవాద్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆయనను ఉతికి ఆరేస్తున్నారు. వచ్చే జన్మదినాన్ని నరేంద్ర మోడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరపుకోవాలని కోరుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a competition to tweet senseless, Pakistan's Minister for Science and Technology Fawad Chaudhry is winning the race. On Tuesday, he posted a foul tweet on Prime Minister Narendra Modi's 69th birthday. "Today reminds us the importance of contraceptives #ModiBirthday". Fawad's tweet became viral and he was mercilessly trolled by the netizens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more