త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష!: పాకిస్తాన్
ఇస్లామాబాద్: పెషావర్ ఘటన తరువాత ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరం చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం దీంతో పాటు శిక్ష పడిన 500 మంది ఉగ్రవాదులను ఉరితీసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు త్వరలో ఉరిశిక్ష అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తొలుత 55 మందికి ఉరిశిక్షను అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. వీరికి సంబంధించిన క్షమాభిక్, పిటిషన్లను దేశ అధ్యక్షుడు మన్మూన్ హుస్సేన్ తిరస్కరించారని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు.
ఉగ్రవాదులకు మరణశిక్షలు అమలు చేయడం వల్ల వచ్చే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇటీవల పెషావర్ పాఠశాలలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే.

ఇంకా తేరుకోని పెషావర్ స్కూలు పిల్లలు!
పెషావర్‌లోని సైనిక స్కూలుపై తాలిబన్ ముష్కరులు జరిపిన పాశవిక దాడి ఘటనను ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసిన పిల్లలు కొందరు ఇంకా తేరుకోని స్థితిలోనే ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు ఆ పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించే యోచనలో పడ్డారు. పిల్లలతోపాటు స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ సంఘటనకు సంబంధించిన భయాందోళనలు తొలగించేందుకు కౌన్సెలింగ్ ఇప్పించనున్నట్లు ఓ అధికారి ఒకరు తెలిపారు.
ఇందుకోసం పెషావర్, ఇస్లామాబాద్ నుంచి మానసిక వైద్యులతోపాటు ఆర్మీ వైద్య అధికారులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన కొందరు అధికారులతో కమిటీ వేయనున్నట్లు తెలిపారు. దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కోలాంటి అంతర్జాతీయ సంస్థలు సహకరిస్తాయన్నారు.
ఆప్ఘన్‌లో 28మంది మిలిటెంట్లు హతం
ఆఫ్ఘనిస్థాన్‌లో సైన్యం జరిపిన దాడిలో 28మంది మిలిటెంట్లు మృతిచెందారు. హెల్మాండ్, పక్టిక్, కునార్, ప్రావిన్స్‌లలో సైన్యం విస్తత్రంగా దాడులు నిర్వహిస్తోంది. కాగా ఎదురుదాడులలో ఐదుగురు సైనికులు చనిపోయారని అధికారవర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications