ఇమ్రాన్ కు విషమ "పరీక్ష్" - నేడే అవిశ్వాస ఓటింగ్ : పదవి ఊడటం ఖాయమంటూ..!!
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ రాజకీయ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఇమ్రాన్ పైన అవిశ్వాసం పై ఈ రోజు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే ఇమ్రాన్ మైనార్టీలో పడ్డారు. దీంతో..ఓటింగ్ జరిగితే ఫలితం ఏంటనేది ఇమ్రాన్ కు స్పష్టత ఉంది. దీంతో..ఇమ్రాన్ ఈ రోజు జరిగే ఓటింగ్ ఎదుర్కొంటారా..లేక, ముందుగానే రాజీనామా చేసి ముందస్తు నిర్ణయం వైపు వెళ్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో ఆదివారం ఓటింగ్ జరుగనుంది. ఇప్పటి వరకు అవిశ్వాసం నుంచి గట్టేక్కేందుకు ఇమ్రాన్ తన ముందున్న అన్ని ఆప్షన్లను పరిశీలించారు.

లాస్ట్ బాల్ వరకు పోరాడుతారా
కానీ, తాను రాజీపడనని..చివరి నిమిషం వరకు పోరాడుతానని స్పష్టం చేసారు. కొందరు తమను వీడి ప్రత్యర్ధులతో చేతులు కలిపి ద్రోహం చేసారంటూ మండిపడ్డారు. విదేశీ కుట్రకు స్వదేశీ నేతలు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన లాయర్లతో మాట్లాడానని, ద్రోహులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇమ్రాన్ తన పదవిలో కొనాగాలాంటే ఆయనకు విశ్వస పరీక్షలో అనుకూలంగా 172 మంది ఓటింగ్ చేయాల్సి ఉంటుంది.

రాజీనామా చేసి ముందస్తు దిశగా
342 సీట్లు ఉన్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ నాయకత్వంలోని పీటీఐ 149 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సరిపోక పోవటంతో చిన్న పార్టీలతో కలిసి 176 సీట్లతో ఇమ్రాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. అయితే, ఇమ్రాన్ పాలన పైన అతి తక్కువ కాలంలోనే వ్యతిరేకత మొదలైంది.
పాకిస్థాన్ అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభం మొదలైంది. ద్రవ్యోల్బణం పెరిగింది. మరోవైపు సైన్యం కూడా ఆయనపై అసంతృప్తిగా ఉంది. దీంతో ఇమ్రాన్‌పై అసమ్మతి సెగ మొదలైంది. ఇమ్రాన్ కు అధికారికంగా ప్రస్తుతం 171 మంది సభ్యుల మద్దతు ఉంది. ప్రతిపక్షానికి స్వతంత్ర సభ్యులతో కలిసి 169 మంది ఉన్నారు.

ఇమ్రాన్ పదవీ నిష్క్రమణ ఖాయమంటూ
అయితే, ఇమ్రాన్ సొంత శిబిరంలోని వారే అసమ్మతి బావుగా ఎగుర వేయటంతో ఇమ్రాన్ ఈ విషమ పరీక్ష నుంచి బయట పడటం కష్టంగా కనిపిస్తోంది. మార్చి 31న అవిశ్వాసం పై చర్చ మొదలైంది. ఈ రోజున ఓటింగ్ జరగనుంది. అయితే, ఓటింగ్ పరిణామాల పైన ఏం జరిగే అవకాశం ఉందనేది ఇమ్రాన్ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఒక స్పష్టత వచ్చిందని చెబుతున్నారు.
అయితే ఈ రాజకీయ అనిశ్చితిని ముగించేందుకు ఇమ్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అవిశ్వాస పరీక్షకు ముందనే ఈ నిర్ణయం ప్రకటిస్తారా..లేక, రాజీనామా ద్వారా పరీక్షకు ముందే రిటైర్డ్ హర్ట్ అవుతారా అనేది చూడాల్సి ఉంది. అయితే, ఈ రోజు పాకిస్థాన్ లో చోటు చేసుకొనే పరిణామాల పైన ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications