భారత్ తో శాశ్వత శాంతి కోరుకుంటున్నాం-పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన

కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి భారత్, పాకిస్తాన్ ఇద్దరిలో ఏ దేశానికీ యుద్ధం సాధ్యం కాదని, చర్చల ద్వారా మాత్రమే భారత్‌తో శాశ్వత శాంతి నెలకొనాలని తాము కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థుల ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం కాశ్మీర్ సమస్య పరిష్కారంతో ఈ ప్రాంతంలో స్థిరమైన శాంతి ముడిపడి ఉందని షరీఫ్ చెప్పారని ది న్యూస్ ఇంటర్నేషనల్ వార్తాపత్రిక తెలిపింది

ఈ ప్రాంతంలో శాంతిని కొనసాగించాలని పాకిస్తాన్ సంకల్పిస్తుందని, ఈ ప్రాంతంలో స్థిరమైన శాంతి ఐరాస తీర్మానాల ప్రకారం కాశ్మీర్ సమస్య పరిష్కారంతో ముడిపడి ఉందని షరీఫ్ పేర్కొన్నారు. రెండు దేశాలకు యుద్ధం ఒక ఆప్షన్ కాదన్నారు. కాబట్టి చర్చల ద్వారా భారత్‌తో శాశ్వత శాంతిని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్య పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదం కారణంగా భారతదేశం-పాకిస్తాన్ మధ్య సంబంధాలు తరచుగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

pakistan prime minister shehbaz sharif wants permanent peace with india

భారతదేశం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం, 2019 ఆగస్టు 5న రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ నిర్ణయంపై పాకిస్తాన్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇది దౌత్య సంబంధాలను తగ్గించడంతో పాటు భారత రాయబారిని బహిష్కరించించేలా చేసింది.

ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పాకిస్థాన్‌తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ ఇప్పటికే పేర్కొంది. ఇస్లామాబాద్, న్యూఢిల్లీ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంలో పోటీ పడాలని షరీఫ్ సూచించారు. పాకిస్తాన్ దురాక్రమణదారు కాదని, దాని అణ్వాయుధ ఆస్తులు, శిక్షణ పొందిన సైన్యం అడ్డంకేనని, ఇస్లామాబాద్ తమ సరిహద్దులను రక్షించడానికి దాని మిలిటరీపై ఖర్చు చేస్తుందని, కానీ దూకుడు కోసం కాదని ప్రధాని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+