వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్ హత్యకు కుట్ర - అందుకే చంపాలని ప్రయత్నాలు : అవిశ్వాసం ఓటింగ్ వేళ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందా. అందుకే ఆయన తాజాగా జాతిని ఉద్దేశించి చేయాల్సిన ప్రసంగం వాయిదా వేసుకున్నారా. ఇప్పుడు ఈ చర్చ హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన హత్యకు కుట్ర జరుగుతోందంటూ పీటీఐ సీనియర్‌ నేత ఫైజల్‌ వవ్దా సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఇమ్రాన్ టార్గెట్ గా రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్షాలతో పాటుగా స్వపక్షంలోనూ ఇమ్రాన్ వ్యతిరేకులు ఆయన్ను ప్రధాని పదవి నుంచి దించేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అవిశ్వాసం ప్రతిపాదించాయి. ఏప్రిల్ 4న అవిశ్వాసం పైన ఓటింగ్ జరగనుంది.

ఇమ్రాన్ లైఫ్ డేంజర్ లో ఉందంటూ

ఇమ్రాన్ లైఫ్ డేంజర్ లో ఉందంటూ


ఇమ్రాన్‌ హత్యకు కుట్ర జరుగుతోందన్న సమాచారం ఇంటెలిజెన్సీ వర్గాలు తమ ప్రభుత్వానికి అందించాయని పీటీఐ నేతలు పలువురు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బుల్లెట్‌ప్రూఫ్‌ షీల్డ్‌తో పాటు కార్లను సైతం ఉపయోగించాలని నిఘా వర్గాలు ఇమ్రాన్‌ ఖాన్‌కు సూచించాయని చెబుతున్నారు. అయితే తాను చావుకు భయపడనని ఇమ్రాన్‌ ఖాన్‌.. తోటి నాయకులతో చెప్పినట్లు స్థానిక మీడియా ఒక కథనం ప్రచురించింది. అయితే ప్రతిపక్షాలు ఇదంతా ఉత్త డ్రామాగా కొట్టిపారేస్తున్నాయి. తాజాగా ప్రధాని ఇమ్రాన్ సైతం కీలక వ్యాఖ్యలు చేసారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఇందుకోసం ప్రతిపక్షాలకు డబ్బు ఆశ ఎర చూపుతున్నాయని పాక్‌ ప్రధాని చెప్పుకొచ్చారు.

హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపణ

హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపణ

ఇమ్రాన్ ఇప్పటికే నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. తన పార్టీకి చెందిన వారెవరూ అవిశ్వాస తీర్మాన సమయంలో ఓటింగ్ కు వెళ్లవద్దని ఆదేశించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ నుంచి రాజీనామాను ఆశించని ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ షహబాజ్‌ షరీఫ్‌.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు పాక్‌ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానిని హత్య చేయడానికి కొందరు ప్రణాళికలు వేస్తున్నారంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సీనియర్ నాయకుడు ఫైసల్ వావ్డా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌ని ఉపయోగించాలని

బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌ని ఉపయోగించాలని


బహిరంగ సభలకు హాజరయ్యేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌ని ఉపయోగించాలని ప్రధానికి సలహా ఇచ్చానని ఫైసల్ వెల్లడించారు. పాకిస్థాన్ ఎవరి యుద్ధంలో భాగం కాబోదని ఫైసల్​ పేర్కొన్నారు. ​ పొరుగు దేశాలపై దాడి చేయడానికి దేశంలోని ఎయిర్‌బేస్‌లను ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రధాని ఇమ్రాన్ ధైర్యవంతుడని చెప్పుకొచ్చారు. ఇక, ఇమ్రాన్ పై అవిశ్వాస తీర్మానానికి మొత్తం 161 మంది సభ్యులు అనుకూలంగా.. ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌ను పదవి నుంచి దించాలంటే ప్రతిపక్షాలకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో..పాకిస్థాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రోజు రోజుకీ ఉత్కంఠ పెంచుతున్నాయి.

English summary
Pakistan senior leader Faisal Vawda has claimed that PM Imran Khan’s life is in danger, a plot has been hatched to assassinate Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X