వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్ నేడే రాజీనామా - అవిశ్వాస పరీక్ష వేళ కీలకంగా : భారత్ పై ప్రశంసలు..!!

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయ భవితవ్యం నేడు తేలిపోనుంది. టీ20 మ్యాచ్ తరహాలో అనేక అనూహ్య మలుపులు తీసుకున్న పాకిస్థాన్ అవిశ్వాస తీర్మాన వ్యవహారం..ఈ రోజు తుది అంకానికి చేరింది. గత వారమే ప్రధాని ఇమ్రాన్ పైప ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే, జాతీయ అసెంబ్లీలో స్పీకర్ నిర్ణయం..ఇమ్రాన్ వ్యూహాలతో అది తప్పిపోయింది. కానీ, న్యాయస్థానం జోక్యం తో ఇప్పుడు అవిశ్వాసం పైన ఓటింగ్ కు రంగం సిద్దమైంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఉదయం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సమావేశం కానుంది. సభలో అవిశ్వాసం పైన ఓటింగ్ జరగనుంది.

Recommended Video

Imran Khan - No Superpower Can Dictate Terms To India | Oneindia Telugu
నేడే అవిశ్వాసం పై ఓటింగ్

నేడే అవిశ్వాసం పై ఓటింగ్


342 స్ధానాలున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో మెజార్టీకి 172 ఓట్లు అవసరం. మిత్రపక్షాలు దూరం కావడం సహా, సొంత పార్టీకి చెందిన సభ్యులు కూడా దూరం కావడంతో ఇమ్రాన్‌ సర్కార్‌ మైనార్టీలో పడింది. దీంతో..విశ్వా పరీక్ష జరిగితే ఇమ్రాన్ పదవి కోల్పోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ సైతం పరోక్షంగా తన ఓటమిని అంగీకరించారు. కానీ, తాను ముందుగానే రాజీనామా చేసే అవకాశం లేదని ఇమ్రాన్ స్పష్టం చేస్తున్నారు. సభలో పరీక్ష తేలినాకే రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవిశ్వాస పరీక్షకు ఒక రోజు ముందు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

భారత్ పైన ఇమ్రాన్ ప్రశంసలు

భారత్ పైన ఇమ్రాన్ ప్రశంసలు


కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే సమయంలో శాంతియుత నిరసనలు తెలపాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో భారత్ పైన ఇమ్రాన్ ప్రశంసలు కురిపించారు. భారత్ ను సార్వభౌమ దేశం గా కొనియాడారు. ప్రపంచంలోని మరే దేశం భారత్‌ను శాసించలేదని వ్యాఖ్యానించారు. ఇక, ఇమ్రాన్‌ ప్రభుత్వ ఓటమి ఖాయం కావడం వల్ల కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు యత్నాలు మొదలుపెట్టాయి. కొత్త ప్రధానిగా విపక్షాలు బలపరుస్తున్న పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రమాణం చేసే అవకాశం ఉంది.

కోర్టు తీర్పును గౌరవిస్తానని చెబుతూనే..

కోర్టు తీర్పును గౌరవిస్తానని చెబుతూనే..


ఇమ్రాన్ తన ప్రసంగంలో తాను కోర్టు తీర్పును గౌరవిస్తానని స్పష్టం చేసారు. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించే ముందు బెదిరింపు లేఖను పరిశీలించి ఉండాల్సిందన్నారు. పాకిస్థాన్‌లో పాలన మార్పును.. అమెరికా దౌత్యవేత్త బెదిరిస్తున్నారని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ రాజీనామా ఖాయమని నిర్ధారించుకున్న ప్రతిపక్షాలు.. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరిపాయి. కేబినెట్‌లో అన్ని పార్టీలకు చోటు ఉండాలని నిర్ణయించాయి. లండన్‌లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తిరిగి రావటంపై చర్చించినట్లు సమాచారం.

English summary
Pakistan PM Imran Khan to face no-confidence vote today, He says Disappointed by SC's verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X