పాకిస్థాన్ మళ్లీ అదే తంతు.. యుద్ధానికి 'ఢీ' అంటూ..!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. మే 7 నుంచి 10 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ లోని పలు కీలక ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. వందలమంది పాకిస్థానీ ఉగ్రవాదులను ఏరిపారేసింది. దాంతో భారత్ సైన్యం శక్తిసామర్థ్యాలు పాకిస్థాన్ కు అర్థం అయ్యాయి. పాకిస్థాన్ తో పాటు ప్రపంచ దేశాలు భారత్ సైన్యం ధైర్య సాహసాలను ప్రత్యక్షంగా చూసింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఎంత కొట్టినా చావని పాములా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసం అయిన పలు స్థావరాలను తిరిగి పునర్నిర్మించుకుంటుంది. తాజాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ధ్వంసం అయిన ఉగ్ర స్థావరాలను తిరిగి నిర్మించుకుంటోంది.

పాకిస్థాన్ కు చెందిన భోలారీ ఎయిర్ బేస్ ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసం అయింది. అయితే తాజాగా ఈ ఎయిర్ బేస్ వద్ద పనులు శరవేగంగా సాగుతున్నాయి. మే 10, 2025 న పాకిస్థాన్ పై చేపట్టిన ఆపరేషన్ లో ఈ ఎయిర్ బేస్ ను పూర్తిగా ధ్వంసం చేసింది భారత్ సైన్యం. దాదాపు 88 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ లో భోలారీ ఎయిర్ బేస్ తో పాటు అనేక కీలక స్థావరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది.

Pakistan Starts Repairing Bholari Airbase Hangar Destroyed in Operation Sindoor Visuals Out now

వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే త్వరలోనే వీటిని కూడా తిరిగి నిర్మించే పనిలో పాకిస్థాన్ నిమగ్నమైనట్లు సమాచారం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+