"పాకిస్థాన్ లో నిద్రలేచిన నరరూప రాక్షసులు.. భారత్ కు పెను ముప్పు"
భారత్ దాయాది దేశం పాకిస్థాన్ ఎంత కొట్టినా చావని పాములా వ్యవహరిస్తోంది. పాకిస్థాన్.. ఎప్పటిలాగే టెర్రరిస్టులకు ఆశ్రయం కొనసాగిస్తూనే ఉందని అమెరికా కాంగ్రెషనల్ రిపోర్ట్ సంచలన విషయాలను వెల్లడించింది. భారత్ లక్ష్యంగా ఇవి పనిచేస్తున్నాయని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ లో లష్కర్-ఏ- తోయిబా, జైష్-ఈ- మహ్మద్ గ్రూప్ లు మరోసారి యాక్టివ్ అయ్యాయని భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆ రిపోర్టు వెల్లడించింది. ఆ గ్రూప్ లు ఇస్లామిస్ట్- తీవ్రవాద భావాజాలంతో పనిచేస్తున్నాయని.. ఆల్ ఖయిదా, ఐఎస్- ఖోరాసన్ లాంటి సంస్థలతో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తున్నాయని హెచ్చరించింది.
పాకిస్థాన్.. టెర్రరిస్టు గ్రూప్స్ కు ఇంకా ఆశ్రయం కొనసాగిస్తూనే ఉందని.. భారత్, కాశ్మీర్ టార్గెట్ అవి కార్యకలాపాలు చేస్తున్నాయని అమెరికాకు చెందిన ఓ రీసెర్చ్ సర్వీస్ తన రిపోర్టును వెల్లడించింది. ఉగ్రవాదులను ఇప్పటివరకు ఎన్నో ఆపరేషన్స్ లో అంతం చేసినా.. టెర్రరిస్టుల నిర్మూలన కోసం ఎన్నో పాలసీలను తీసుకొచ్చినా పాకిస్థాన్ లో మాత్రం కొన్ని టెర్రరిస్టు గ్రూప్ లు ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయని ఈ మేరకు భారత్ లో భవిష్యత్తులో ముప్పును కలిగించేందుకు సిద్ధం అవుతున్నాయని ఆ రిపోర్టులో ఉంది.
లష్కర్-ఏ- తోయిబా గ్రూప్ 2008 ముంబై దాడుల సూత్రధారి, జైష్-ఏ- మహ్మద్ గ్రూప్ 2001 పార్లమెంట్ దాడి పథకాన్ని రచించింది. అయితే ఈ రెండు తీవ్రవాద సంస్థలు పాకిస్థాన్ లో యాక్టివ్ గా ఉన్నట్లు ది కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ పేర్కొంది. పాకిస్థాన్ ను ఈ టెర్రరిస్టు సంస్థలు.. బేస్ గా అలాగే టార్గెట్ గా మలుచుకుంటున్నాయని తెలిపింది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ లో ఉగ్రవాదం పెరిగింది. 2019 నాటికి ఉగ్రవాద దాడుల్లో మృతి చెందినవారి సంఖ్య 365 కు తగ్గిపోగా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ.. 2025లో మృతుల సంఖ్య 4,001 కు చేరిందని గత 11 ఏళ్లలో ఇదే అత్యధికం అని అమెరికా రిపోర్టు తేల్చింది.
టెర్రరిజంతో అత్యధిక ప్రభావం చెందిన దేశంగా పాకిస్థాన్ ఉందని రిపోర్టు ప్రకారం తెలుస్తోంది. ఆఫ్గానిస్తాన్ లో 2021లో తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి పాకిస్థాన్ లో తీవ్రవాద కార్యకలాపాలు అధికం అయ్యాయని రిపోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలు 5 విభాగాలుగా ఉన్నాయని అవి.. గ్లోబల్ గా, ఆఫ్గానిస్తాన్ లక్ష్యంగా, భారత్- కాశ్మీర్ లక్ష్యంగా, దేశీయంగా, అలాగే సెక్టేరియన్ అవుట్ ఫిట్స్ ఇలా ఐదు భాగాలుగా ఉన్నాయి.
ముఖ్యంగా పాకిస్థాన్- ఆఫ్గానిస్తాన్ సరిహద్దులో 4-6 వేల మంది ఫైటర్స్ అనే పేరుతో ఉగ్రవాదులు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. ఇక పాకిస్థాన్ లో దేశీయంగా అత్యంత క్రూరమైన సంస్థగా తెహ్రీక్-ఐ- తాలిబాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇందులో 2,500 నుంచి 5వేల మంది ఫైటర్ పని చేస్తున్నారు. పాకిస్థాన్ లో ప్రభుత్వాన్ని కూల్చి షరియా చట్టాన్ని అమలు చేసేందుకు ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా రిపోర్టు వెల్లడించింది.

ఇక గతేడాది ఏప్రిల్ 22 న కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడులకు 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే7-10 వరకు జరిగిన ఈ ఆపరేషన్ లో వందలాది మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications