భారత్ కు చైనా, పాకిస్థాన్ ఒకేసారి వార్నింగ్..! భారత్ కు ముప్పు పొంచి ఉందా..?
భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాతో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. భారత్ కు దెబ్బకొట్టేందుకు పాకిస్థాన్, చైనాలు ఎప్పుడూ ప్లాన్ చేస్తూ ఉంటాయి. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లోనూ ఆ దేశం చైనా కు చెందిన అత్యాధునిక ఆయుధాలను భారత్ పై ప్రయోగించింది. ఇక పాకిస్థాన్- చైనా మధ్య రక్షణ, అంతరిక్ష భాగస్వామ్యం బలంగానే ఉంది. తాజాగా పాకిస్థాన్ కు చెందిన PRSC-EO3 శాటిలైట్ ను చైనా ప్రయోగించింది. షాంగ్జీ ప్రావిన్స్ లోని తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది. పాకిస్థాన్, చైనా సవాళ్లతో భారత్ అలర్ట్ అయింది.
పాకిస్థాన్- చైనా మైత్రి మరోసారి బట్టబయలు అయింది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లోని తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి పాకిస్థాన్ కు చెందిన PRSC-EO3 శాటిలైట్ ను చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని లాంగ్ మార్చ్- 6 రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపించారు. అయితే గతేడాది కాలం నుంచి చైనా ప్రయోగించిన పాకిస్థాన్ కు చెందిన నాలుగో శాటిలైట్ ఇది కావడం గమనార్హం. దాంతో ఇరు దేశాల మధ్య అంతరిక్ష బంధం మరింత బలపడినట్లుగా స్పష్టం అవుతోంది. శాటిలైట్ ప్రయోగంతో పాటుగా చైనా స్పేస్ మిషన్ లో పాల్గొనేందుకు ఇద్దరు పాకిస్థానీ వ్యోమగాములు సైతం ట్రైనింగ్ కోసం ఇప్పటికే బీజింగ్ చేరుకున్నట్లు సమాచారం.

ఇక ట్రైనింగ్ తర్వాత వీరిలో ఒకరు చైనాకు చెందిన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ కు చేరుకోనున్నారు. దాంతో చైనా అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టిన తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థాన్ ప్రతినిధి నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు చైనా- పాకిస్థాన్ మధ్య ఉన్న వ్యూహాత్మక, సాంకేతిక సహకారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలపై భారత్ అలర్ట్ అయింది. చైనా, పాకిస్థాన్ కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి నుంచి భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications