అయ్యో అయ్యో అయ్యయ్యో: నవాజ్ షరీఫ్
కరాచీ: దాయాది పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ బతుకు బస్టాండ్ అయిపోయింది. నవాజ్ షరీఫ్ కు ఇప్పుడు అన్ని కష్టాలే ఎదురౌతున్నాయి. నవాజ్ షరీఫ్‌కు పీకల్లోతు కష్టాలు చుట్టుముట్టాయి. నవాజ్ షరీఫ్ కుటుంబసభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని పనామా పత్రాల్లో వెల్లడైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్‌కు షాక్ ఇచ్చింది. ఆయన అవినీతి ఆరోపణలపై విచారణ చెయ్యాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రతిపక్ష నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ తన ఆందోళనను విరమిస్తున్నట్టు ప్రకటించారు.
బుధవారం తలపెట్టిన ఇస్లామాబాద్ ముట్టడిని విరమించుకుంటున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని పనామా పత్రాల్లో వెల్లడైన నేపథ్యంలో ఈ వ్యవహారంలో షరీఫ్ బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు.

నవంబర్ 2వ తేదిన ఇస్లామాబాద్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆరోజు లక్షలాది మందితో రాజధాని ఇస్లామాబాద్ ని పూర్తిగా స్తంభింపజేసి తమ సత్తా చాటుతామని, నవాజ్ షరీఫ్ రాజీనామా చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
ఇందుకోసం ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) భారీగా సన్నాహాలు చేసింది. లక్షలాది మందిని ఇస్లామాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుతో నవాజ్ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇప్పటికే ఉగ్రవాదం, జమ్మూకశ్మీర్ వివాదం సహా పలు విషయాల్లో ఇంటా బయటా ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్ మరింత ఇరకాటంలో పడ్డారు. మరోవైపు నవాజ్ షరీఫ్‌ను గద్దె దించేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్న ఇమ్రాన్ ఖాన్ తన ధర్నాను విరమించుకోవడంతో పాక్‌లో ఉద్రిక్తత కొంత సడలింది.












Click it and Unblock the Notifications