వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కు బుద్ధి చెప్పిన భారత్ దళాలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పదేపదే కాల్పులకు పాల్పడుతూ భారత్ సైన్యం సహనాన్ని పరిక్షీస్తున్న పాక్ కు తగిన బుద్ధి చెప్పింది సోమవారం వేకువ జామున కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ సైన్యంపై మన జావాన్లు కాల్పులు జరిపారు.

ఎదురు కాల్పులు జరపడంతో పాక్ సైన్యం కాలికి బుద్ధి చెప్పింది. గత కొంత కాలంగా పాక్ సైన్యం పదేపదే భారత్ బలగాల మీద కాల్పులు జరుపుతూ రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. కాశ్మీర్ సరిహద్దులోని పూంచ్ జిల్లాలో సోమవారం వేకువ జామున పాక్ బలగాలు భారత్ ఔట్ పోస్టుల మీద కాల్పులకు తెగబడింది.

Pakistan targets Indian posts in poonch district in Jammu and Kashmir

అప్రమత్తమైన భారత్ దళాలు పాక్ కాల్పులను తిప్పికొట్టారు. సుమారు ఒక గంట పాటు ఆ ప్రాంతంలో కాల్పులు జరపడంతో తుపాకి తూటాలతో దద్దరిల్లింది. ఎదురు కాల్పులు జరపడంతో పాక్ సైన్యం మెత్తబడింది. అయితే ఈ కాల్పులలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని భారత సైనిక వర్గాలు తెలిపాయి.

శాంతి చర్చలు అంటూనే పాక్ సైన్యం నియమాలు గాలికి వదిలి కాల్పులకు తెగబడుతున్నది. పూంచ్, నౌషారా జిల్లాలలోని భారత్ ఔట్ పోస్టుల ను టార్గెట్ చేసుకున్న పాక్ సైన్యం పదేపదే కాల్పులు జరుపుతూ నియమాలు ఉల్లంఘించింది. జులై 15వ తేది నుండి ఇప్పటి వరకు పాక్ 7 సార్లు నియమాలు ఉల్లంఘించి కాల్పులు జరిపింది.

English summary
Pakistani troops on Monday targeted several Indian posts along the LoC in Poonch district of Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X