వాషింగ్టన్: పాకిస్థాన్‌పై అగ్ర రాజ్యం అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అణుసామర్థ్యం తమకి ఉందంటూ పాకిస్థాన్ చేస్తున్న బెదిరింపులు ఆపకపోతే.. అది మరో ఉత్తరకొరియాలా అవుతుందని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ జనరల్ హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పాక్ రాష్ట్ర విధానంగా మార్చుకుంటోందని ఆయన మండిపడ్డారు.
ట్రంప్‌కు ప్రాణభయం! ఇవాంకను అనుకున్నారట!: మైఖేల్ వూల్ఫ్ సంచలనం
వాయిస్ ఆఫ్ అమెరికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ద్వంద వైఖరి అమెరికాను, డొనాల్డ్ ట్రంప్‌ను నిరుత్సాహానికి గురి చేసిందని ఆయన తెలిపారు. పాక్‌తో గొప్ప భాగస్వామ్యం ఉన్న అమెరికానే కాదు.. సొంత దేశ ప్రజలను కూడా పాక్ నమ్మించి మోసం చేసిందని మెక్‌మాస్టర్ అన్నారు.

ఉగ్రవాదులకు అండగా పాక్
‘తాలిబన్లు, హక్కానీ నెట్‌వర్క్ సంస్థలకు పాక్ స్వర్గధామంగా నిలిచింది. పాక్ ప్రజలపై అమెరికాకు ఎంతో సానుభూతి ఉంది. కానీ, ఆ దేశం అవేమి లెక్క చేయకుండా ఉగ్రవాదులకు అండగా నిలుస్తోంది. వాళ్లు ఆశ్రయం ఇచ్చిన ఉగ్రవాదుల కారణంగానే ఎంతో మంది పాక్ ప్రజలు చనిపోతున్నారు. కొన్నేళ్ల క్రితం ఓ పాఠశాలలో మారణహోమం జరిగి ఎంతో మంది చిన్నారులు చనిపోవడం అందుకు నిదర్శనం' అని ఆయన పేర్కొన్నారు.

ఇలాగే పోతే..
అంతేగాక, ‘పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సహాయం చేయడం ఆపేస్తే.. ఇక ఏ దేశాలు కూడా ఆ దేశానికి సాయం చేసేందుకు ముందుకు రావు. ఉగ్రవాదులకు ఇలాగే మద్దతు ఇస్తూ పోతుంటే.. ఇతర దేశాలతో పాటు పాక్ మిత్రదేశమైన చైనా కూడా అండగా నిలవదు' అని మెక్‌మాస్టర్ పేర్కొన్నారు.
పాక్‌కు న్యూ ఇయర్ షాక్: ఫూల్స్ చేశారంటూ ట్రంప్ ఫైర్, తీవ్ర హెచ్చరిక

మరో ఉత్తరకొరియా..
తమ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయని, శక్తిమంతమైన అణుసామర్థ్యం ఉందని ఇతర దేశాలపై బెదిరింపులకు దిగడం ఆపకపోతే.. మరో ఉత్తరకొరియాలా అవుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఇప్పటికే నిధుల నిలిపివేత
ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు పాక్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అమెరికా ఇప్పటికే పాక్‌కు 255 మిలియన్ డాలర్ల సహకారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందంటూ ట్రంప్ ఇప్పటికే పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమను మోసం చేసిందని మండిపడ్డారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!