భారత ఆర్మీని ఎదుర్కొనే సత్తా లేక.. పాక్ దురాగతం
India Pakistan War: పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. ఆపరేషన్ సింధూర్ మిషన్ చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులకు దిగింది. శతృదేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం.
తాజా దాడుల్లో జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం సంభవించింది. బహవాల్‌పూర్ అహ్మద్‌పూర్ ఈస్ట్‌లో సుభాన్ మసీద్ ప్రాంతంలో చాలాకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న జైషె మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి. ముజఫ్ఫరాబాద్‌లో బిలాల్ మసీద్ ప్రాంతంలో మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన మూడు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, సియాల్‌కోట్‌లో మురిడ్కె, కోట్కి, షక్కర్‌ఘర్‌లల్లో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన రెండు క్యాంపులు ధ్వంసం అయ్యాయి.

ఈ పరిణామాలతో భారత్- పాకిస్తాన్ సరిహద్దు మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీకరంగా తయారయ్యాయి. రెండు దేశాలు కూడా సైన్యాన్ని సరిహద్దులకు తరలించాయి. యుద్ధ సామాగ్రిని చేరవేశాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. బంకర్లల్లో తలదాచుకోవాలనీ సూచించింది.
అదే సమయంలో పాకిస్తాన్ దురాగతాలకు తెర తీసింది. సరిహద్దు గ్రామాలపై మోర్టార్ షెల్స్‌తో దాడులకు దిగింది. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఈ దాడులు చోటు చేసుకున్నాయి. భారత్ వైమానిక దాడులు ముగిసిన కొద్దిసేపటికే సాధారణ పౌరులపై ఇలా మోర్టార్ షెల్స్‌తో ప్రతీకారానికి పాల్పడింది పాక్.
పూంచ్‌లోని కృష్ణ ఘాటి, షాపూర్, మన్‌కోఠ్, జమ్మూ సెక్టార్ రాజౌరి జిల్లాలోని లామ్, మన్జా కోఠ్, కాశ్మీర్ సెక్టార్ కుప్వారా జిల్లాలోని కర్నా, యూరి, తంగ్ధర్, బారాముల్లా వంటి జిల్లాల సరిహద్దు గ్రామాల నివాసితులపై భారీ షెల్లింగ్ దాడులు సాగించింది పాకిస్తాన్ ఆర్మీ. ఫిరంగులతో కాల్పులు జరిపారు.
ఆ ఘటనలో పలు నివాసాలు దెబ్బతిన్నాయి. దీని తరువాత ఆయా గ్రామాలన్నీ కూడా ఖాళీ అయ్యాయి. స్థానికులు బంకర్లకు తరలివెళ్లారు. మరికొందరు సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోయారు. తంగ్ధర్‌లో భారీ నష్టం సంభవించింది. పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. కొన్ని మంటల్లో చిక్కుకున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అతి భారీ షెల్లింగ్ ఇదే.
ఈ ఘటన తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, డీజీపీకి ఫోన్ చేశారు. సరిహద్దు భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. ప్రాణనష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. అదనపు పోలీసు బలగాలను మోహరింపజేయాలని, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications