విషాదం: యువకుడి ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
ఇస్లామాబాద్: ప్రపంచ వ్యాప్తంగా యువతను ఆకట్టుకుంటున్న సెల్ఫీ.. ఎంతోమంది ప్రాణాలను కూడా తీస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ మృతి చెందాడు. వివరాల్లోకెళితే.. పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతానికి చెందిన జంషేద్ ఖాన్(22) రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
కాగా, రైలు కదులుతున్న సమయంలో పట్టాలపై నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో రైలు కాస్త వేగంగా కదలడంతో అతనిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి తండ్రి మహమ్మద్ పర్వేజ్‌కు విషయాన్ని తెలియజేశారు. అయితే తన కుమారుడు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొందని తండ్రి ఆరోపించారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మిలిటెంట్ల దాడులు: 30 మంది మృతి
బోకోహరామ్ మిలిటెంట్లు మూడు గ్రామాలపై విచాక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో 30 మంది మృతిచెందారు. అయితే, శనివారం నాడు జరిగిన ఈ దాడి విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఈశాన్య నైజీరియాలో బొకోహరామ్ వర్గం జరిపిన దాడులలో సుమారు 30 మంది మృతి చెందగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. నైజీరియా మిలిటరీకి సహాయం చేస్తున్న కారణంగా ఆ మూడు గ్రామాల ప్రజలపై మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారని ఓ బాధితుడు వివరించాడు.












Click it and Unblock the Notifications