నా కూతురు తప్పు చేసింది, చంపేశా: వీధుల్లో ఓ తల్లి
లాహోర్: పాకిస్తాన్‌లో పరువు హత్య చోటు చేసుకుంది. తన కూతురు ప్రేమించి తప్పు చేసిందని, అందుకే తాను చంపేశానని మృతురాలి తల్లి చెప్పడం గమనార్హం. పాకిస్తాన్‌లో ప్రేమ అనేది పెద్ద నేరంగా మారుతోంది. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు.
పరువు హత్యలు పెరుగుతున్నాయి. తాజాగా, ఓ తల్లి కన్న కూతురును దారుణంగా చంపేసింది. అనంతరం వీధిలోకి వచ్చి తన కూతురు తప్పు చేసిందని, అందుకే చంపేశానని ఏడుస్తూ చెప్పింది. లాహోర్‌లో రఫిక్ అనే మహిళకు 18 ఏళ్ల కూతురు జీనత్ ఉంది.

జీనత్.. హాసన్ ఖాన్ అనే మెకానిక్‌ను ప్రేమించింది. జీనత్ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పినా గత నెలలో కోర్టుకెళ్లి మరీ పెళ్లి చేసుకుంది. నాలుగు రోజుల పాటు భర్తతో ఉంది. ఆ తర్వాత జీనత్ కుటుంబ సభ్యులు వచ్చి, ఏం హానీ తలపెట్టమని, విందు చేద్దామని పిలిపించారు.
జీనత్ తల్లి, ఇతర కుటుంబ సభ్యుల మాటలు నమ్మి ఇంటికి వచ్చింది. ఆమె ఇంటికి వచ్చినప్పటి నుంచి వేధించడం ప్రారంభించారు. అతనిని మరిచిపోవాలని సూచించారు. జీనత్ అంగీకరించలేదు. దీంతో, ఆమె తల్లి కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆమె చనిపోయింది. అనంతరం ఆ తల్లి వీధిలోకి వచ్చి తన గట్టిగా అరుస్తూ.. తన కూతురు తప్పు చేసిందని, అందుకే చంపేశానని చెప్పింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications