పాకిస్థాన్ సంచలనం: 1.5 లక్షల ఉద్యోగుల తొలగింపు, 6 మంత్రిత్వ శాఖలు రద్దు

ఇస్లామాబాద్: పరిపాలనా వ్యయాలను తగ్గించే ప్రయత్నంలో పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ ఆదివారం 7 బిలియన్ల డాలర్ల రుణ ఒప్పందం కింద IMFతో అంగీకరించిన సంస్కరణల్లో భాగంగా సుమారు 1,50,000 ప్రభుత్వ పోస్టుల తొలగింపుతోపాటు ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసింది. మరో రెండింటిని విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబరు 26న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చివరకు సహాయ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. సబ్సిడీలను పరిమితం చేయడం, కొన్ని ఆర్థిక బాధ్యతలను ప్రావిన్సులకు బదిలీ చేయడం, ఖర్చులను తగ్గించడం, పన్ను- జీడీపీ నిష్పత్తిని పెంచడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వంటి సాంప్రదాయేతర రంగాలపై పన్ను విధించడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉన్న తర్వాత మొదటి విడతగా 1 బిలియన్ డాలర్లకు పైగా విడుదల చేసింది.

Pakistan s deal with IMF lay off 1 5 lakh employees abolish 6 ministries

అమెరికా నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా మీడియాను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ మాట్లాడుతూ.. IMFతో ఒక కార్యక్రమాన్ని ఖరారు చేశామని, ఇది పాకిస్థాన్‌కు చివరి కార్యక్రమం అని తెలిపారు. 'ఇది చివరి కార్యక్రమం అని నిరూపించడానికి మేము మా విధానాలను అమలు చేయాలి' అని అన్నారు. G20లో చేరడానికి, ఆర్థిక వ్యవస్థను అధికారికంగా రూపొందించాలని ఉద్ఘాటించారు.

మంత్రిత్వ శాఖల్లో రైట్ సైజింగ్ జరుగుతోందని, ఆరు మంత్రిత్వ శాఖలను మూసివేయాలనే నిర్ణయం అమలులోకి రానుందని, రెండు మంత్రిత్వ శాఖలు విలీనం కానున్నాయని మంత్రి చెప్పారు. "అదనంగా, వివిధ మంత్రిత్వ శాఖలలో 150,000 పోస్టులు తొలగిస్తున్నాం" అని మంత్రి ఔరంగజేబ్ చెప్పారు.

పన్ను రాబడిని పెంచడంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. గత సంవత్సరం దాదాపు 3,00,000 మంది కొత్త పన్ను చెల్లింపుదారులు ఉన్నారని, ఈ సంవత్సరం ఇప్పటివరకు 732,000 మంది కొత్త పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నారు. దేశంలో మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.6 మిలియన్ల నుంచి 3.2 మిలియన్లకు పెరిగిందని తెలిపారు. నాన్-ఫైలర్స్ కేటగిరీని రద్దు చేస్తామని, పన్నులు చెల్లించని వారు ఇకపై ఆస్తులు లేదా వాహనాలను కొనుగోలు చేయలేరని ఔరంగజేబ్ చెప్పారు.

ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పయనిస్తోందని, దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయని మంత్రి పేర్కొన్నారు. జాతీయ ఎగుమతులు, ఐటీ ఎగుమతులు రెండింటిలోనూ గణనీయమైన వృద్ధిని హైలైట్ చేసారు. ఆర్థిక వ్యవస్థ శక్తికి సంబంధించి పెట్టుబడిదారుల విశ్వాసం ఒక ప్రధాన విజయమని పేర్కొన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీ రేటును 4.5 శాతం తగ్గించిందని, మార్పిడి రేటు, పాలసీ రేటు ఆశించిన విధంగానే ఉంటుందని ఔరంగజేబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. "ప్రభుత్వ విధానాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గినందున ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న మా వాదన బూటకపు వాదన కాదు. ద్రవ్యోల్బణం సింగిల్ డిజిట్‌కు పడిపోయింది' అని మంత్రి తెలిపారు.

గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకోవడానికి కష్టపడుతోంది. అది 2023లో డిఫాల్ట్‌కు దగ్గరగా ఉంది, అయితే IMF ద్వారా సకాలంలో USD 3 బిలియన్ల రుణం పరిస్థితిని మెరుగుపర్చింది.

అదే చివరి రుణం అనే ఆశ, నిబద్ధతతో పాకిస్తాన్ ప్రపంచ రుణదాతతో దీర్ఘకాలిక రుణం కోసం చర్చలు జరిపింది. అయితే, దేశం ఇప్పటికే ఫండ్ నుంచి దాదాపు రెండు డజన్ల రుణాలను పొందింది. అయితే ఆర్థిక వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడంలో విఫలమైంది కాబట్టి చాలా మంది నిపుణులు ఈ దావాను అనుమానిస్తుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+