Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"భారత్ తో యుద్ధం తర్వాత మా ఫైటర్ జెట్స్ కు ఫుల్ గిరాకీ"

పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్ మరోసారి నవ్వుల పాలయ్యారు. మరో ఆరు నెలల్లో తమకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) నుంచి అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చని అన్నారు. గతేడాది మే 7 నుంచి 10 వరకు భారత్ తో నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధం తర్వాత తమ ఫైటర్ జెట్స్ కు అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ పెరిగిందని తెలిపార. హాట్ కేకుల్లా తమ ఫైటర్ జెట్స్ అమ్ముడవుతున్నాయంటూ ప్రగల్భాలు పలికారు. ఈ మేరకు పాకిస్థాన్ లోని జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయ మీడియా ముందు మరోసారి నవ్వులపాలయ్యారు.

గతేడాది ఏప్రిల్ 22 న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. మే 7 నుంచి 10 వరకు నాలుగు రోజులపాటు పాకిస్థాన్ కంటిమీద కునుకు లేకుండా చేసింది. పాకిస్థాన్ , పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని 9 కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది. దాంతో భారత్ సైన్యం శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. అయితే పాకిస్థాన్ మాత్రం ఈ విషయంలో ప్రగల్భాలు పలికి మరోసారి అంతర్జాతీయ మీడియా ముందు నవ్వులపాలైంది.

తాజాగా ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్ పాకిస్థాన్ లోని జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి బొక్క బోర్లపడ్డారు. భారత్ తో యుద్ధంలో పాకిస్థాన్ వద్ద ఉన్న ఫైటర్ జెట్స్ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయని ప్రగల్భాలు పలికారు. దాంతో పాకిస్థాన్ కు చెందిన ఫైటర్ జెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని తద్వారా తమకు ఆర్థికంగా లాభం చేకూరిందని అన్నారు.

రక్షణ ఉత్పత్తుల ఎగుమతితో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని.. మరో ఆరు నెలల్లో తమకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) నుంచి అప్పులు తీసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చని అన్నారు. అయితే ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన నేపథ్యంలో నెట్టింట అతనిపై ట్రోలింగ్ మొదలైంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మీడియా ముందు మరోసారి పాకిస్థాన్ నవ్వులపాలైంది.

పాకిస్థాన్- చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన జేఎఫ్-17 థండర్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ ను కొలుగోలు చేసేందుకు ఇప్పటికే బంగ్లాదేశ్- పాకిస్థాన్ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అలాగే ఈ ఫైటర్ జెట్ ను కొనుగోలు చేసేందుకు సౌదీ అరేబియా సైతం ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Pakistan s Khawaja Asif Fighter Jets Selling Like Hotcakes After India Clash IMF Bailout Soon Obsolete

ఇక ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో నలుగురు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ ఉన్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలతో పాటు రహీమ్ యార్‌ ఖాన్ ఎయిర్‌ బేస్‌ కూడా ధ్వంసం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+