పనామా పేపర్స్: నవాజ్ షరీఫ్‌కు సుప్రీం షాక్, రాజీనామా చేస్తారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

కరాచీ: పాకిస్తాన్ సుప్రీం కోర్టు గురువారం నాడు ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గట్టి షాక్ ఇచ్చింది. గతంలో పనామా పేపర్స్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఇందులో షరీఫ్ పేరు వచ్చింది.

ఈ పనామా పేపర్స్ అంశంలో నవాజ్ షరీఫ్ పైన విచారణ జరపాలని పాక్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. షరీఫ్‌ను విచారించాలన్న సుప్రీం తీర్పు ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ. వచ్చే ఏడాది పాక్‌లో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో ఆయనకు గట్టి షాక్.

Panama papers: Pak SC orders probe against Nawaz Sharif

పనామా కేసులు నవాజ్ షరీఫ్, ఆయన కొడుకులు జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జేఐటీ) ఎదుట హాజరు కావాలని సుప్రీం ఆదేశించింది. జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం వారం రోజుల్లో ఏర్పాటు కావాలని, రెండు నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.

ప్రధానమంత్రిగా ఆయన కేసును ఎదుర్కోవడం గమనార్హం. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Nawaz Sharif will be probed by a joint investigation team in connection with the Panama papers case. The order of the Pakistan Supreme Court comes as a major setback to the Sharif considering he will face a probe as the sitting PM of Pakistan.
Please Wait while comments are loading...