కుటుంబసభ్యుల ఎదుటే బాలికపై అత్యాచారం, ఎందుకంటే?

ఓ యువతిపై అత్యాచారం చేసినందుకు ప్రతీకారంగా నిందితుడి సోదరిపై కుటుంబసభ్యుల సమక్షంలోనే అత్యాచారం చేయాలని గ్రామపంచాయితీ పెద్దలు ఆదేశించారు. ఈ ఆదేశాలను ఆ యువకుడు పాటించాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లోని పంజ

పంజాబ్: ఓ యువతిపై అత్యాచారం చేసినందుకు ప్రతీకారంగా నిందితుడి సోదరిపై కుటుంబసభ్యుల సమక్షంలోనే అత్యాచారం చేయాలని గ్రామపంచాయితీ పెద్దలు ఆదేశించారు. ఈ ఆదేశాలను ఆ యువకుడు పాటించాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన చెందిన ఓ గ్రామపంచాయితీ పెద్దలు దారుణమైన తీర్మాణం చేశారు.. ఈ తీర్మాణం ప్రకారంగా కుటుంబసభ్యుల ఎదుటే 16 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేయాలని తీర్మాణం చేశారు. అయితే ఆ బాలిక చేసిన తప్పేమీలేదు.

బాలిక సోదరుడు మరో యువకుడి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామపెద్దలు ఈ తీర్మాణం చేశారు. ముజప్పరాబాద్‌లోని రాజ్‌పుర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ ఘటనకు కారణమైన 20 మందిని అరెస్టుచేశారు.

Panchayat orders man to rape girl in front of family in Pakistan

ఈ ఆదేశాలను జారీచేసిన పంచాయితీ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి సోదరుడు తన సోదరిని అత్యాచారం చేశాడని ముహల్లేకు చెందిన ఓ యువకుడు ఫిర్యాదుచేశాడు. ఈ వ్యవహరం గ్రామపంచాయతీకి చేరింది.

దీంతో పంచాయితీ అధ్యక్షుడు అత్యాచార బాధితురాలి సోదరుడు ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి
సోదరిని రేప్ చేయాలని ఆదేశించారు. ఈ తీర్మాణాన్ని బాధితురాలి కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉదంతంలో ఇదే సరైన శిక్షని పేర్కొన్న పంచాయితీ దాన్ని అమలయ్యేలా చూసింది.

ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+