పిల్లల్ని గదిలో బంధించి: ఆ తల్లిదండ్రులు ఎంతకి తెగించారంటే?..

ఇంతలో పిల్లల తాతయ్య ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికీ.. లోపలి నుంచి పిల్లల ఏడుపులు వినిపించడం గమనించాడు. విషయం అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..

కువైట్: కన్నబిడ్డలను గదిలో బంధించి.. తల్లిదండ్రులు ఇద్దరూ విదేశాలకు చెక్కేయాలనుకున్నారు. అనుకున్నట్లే పిల్లలను ఇంట్లో బంధించి.. చెప్పా పెట్టకుండా పారిపోయారు. సమయానికి పిల్లల తాతయ్య ఆ ఇంటికి రావడంతో.. పిల్లలను గదిలో బంధించినట్లు గుర్తించి వారిని రక్షించాడు. కువైట్ లోని ఖైతాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఖైతాన్ ప్రాంతంలో నివాసముండే ఈజిప్షియన్ జంటకు నాలుగేళ్లు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పిల్లలను వదిలించుకోవాలని చేశారో లే మరేమో తెలియదు కానీ.. మొత్తానికి పిల్లలను గదిలో బంధించి చెరో వైపు వెళ్లిపోయారు. ఇంటి నుంచి కారులో బయలుదేరిన భార్య.. అటు నుంచే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.

parents face five years jail sentenced by kuwait court

ఇంతలో పిల్లల తాతయ్య ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికీ.. లోపలి నుంచి పిల్లల ఏడుపులు వినిపించడం గమనించాడు. విషయం అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు రంగప్రదేశం చేసి పిల్లలను గది నుంచి విడిపించారు. పిల్లల తండ్రిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. చివరకు భార్యభర్తలు ఇద్దరు విదేశాలకు చెక్కేసినట్లు గుర్తించారు.

దీంతో అన్ని ఎయిర్ పోర్టులని అప్రమత్తం చేసిన పోలీసులు.. చివరకు ఓ ఎయిర్ పోర్టులో భార్యాభర్తలను అరెస్టు చేశారు. చిన్నపిల్లల ఇంత నిర్దయగా వ్యవహరించిన ఈ జంటకు దేశ బహిష్కరణ శిక్ష వేస్తున్నట్లు కువైట్ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+