ఏం ప్లాన్: బ్యాగులో పెట్టి పందిని మహిళ విమానం ఎక్కించింది
వాషింగ్టన్: అమెరికా ఎయిర్లోవేస్‌కు చెందిన విమానంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా పంది పిల్లను మరో ప్రాంతానికి తీసుకెళ్లాలని ఓ ప్రయాణికురాలు భావించింది. దాన్ని సంచీలో పెట్టుకుని విమానం ఎక్కింది. అయితే, ఆ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎందురైంది. దీంతో ఆమెను విమాన సిబ్బంది అర్థాంతరంగా దింపివేశారు.
ఈ వివరాలు ఇలా ఉన్నాయి - బుధవారం నాడు ఓ మహిళ ఓ మోస్తరు బ్యాగుతో యూఎస్ ఎయిర్‌వేస్ విమానమెక్కింది. కనెక్టికట్‌లోని బ్రాడ్లే ఎయిర్ పోర్టులో విమానం ఆగివుంది. ఆ మహిళ చేతిలో ఉన్న బ్యాగులో ఓ పందిపిల్లను ఉంచుకుంది. ఆ తర్వాత ఆమె నేరుగా వెళ్లి మసాచుసెట్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జోనాథన్ స్కోల్నిక్ పక్క సీట్లో కూర్చుంది.

అయితే, బ్యాగులోని పందిపిల్ల తన సహజ స్వభావ రీత్యా గుర్ గుర్ మంటూ అరుపులు మొదలు పెట్టింది. అంతటితో ఊరుకోకుండా, బ్యాగులోంచి బయటపడి విమానంలో అటూ పరుగులు పెట్టింది. దీంతో, విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పందిపిల్ల నియంత్రణ కోల్పోయిందని, ఆమె వెంటనే దాన్ని తీసుకుని వెళ్లిపోవాలని సూచించారు.
దీంతో, ఆ ప్రయాణికురాలు తన పందిపిల్లను తీసుకుని విమానం దిగిపోయింది. అమెరికా విమాన రవాణా చట్టం ప్రకారం జంతువులు ఇబ్బంది కలిగించనంత వరకు వాటిని విమానాల్లో రవాణా చేయడానికి అనుమతిస్తారని యూఎస్ ఎయిర్ వేస్ ప్రతినిధి లారా మాస్విడాల్ తెలిపారు.












Click it and Unblock the Notifications