ఘోర ప్రమాదం: ప్లేన్ క్రాష్, 44 మంది మృతి?

Posted By:
Subscribe to Oneindia Telugu

సూడాన్: దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న సౌత్‌ సుప్రీం ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం వూ ఎయిర్ పోర్టులో రన్ వేపై కుప్పకూలింది.

ప్రయాణ సమయంలో విమానంలో 44 మంది ఉన్నారు. ప్రమాదంలో వారంతా మృతి చెందినట్లు భావిస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, పలువురు గాయపడినట్లు మాత్రమే వార్తలు వస్తున్నాయి. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. 17 నుంచి 18 మంది తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.

పలువురిని ఆసుపత్రికి తరలించినట్లు స్టేట్ ఇన్‌ఫర్మేషన్ మినిస్టర్ బోనా గుడెన్సియో చెప్పారు. అధికారిక సమాచారం తెలియాలి. విమానం దక్షిణ సూడాన్‌ రాజధాని జుబా నుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A plane has crashed in South Sudan killing 44 passengers.
Please Wait while comments are loading...