రష్యాలో కుప్పకూలిన విమానం, 71 మంది మృతి?

Posted By:
Subscribe to Oneindia Telugu

మాస్కో: రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. 71 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఓ విమానం కుప్పకూలిపోయింది. సరోత్సవ్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఏఎన్ 148 విమానం రాజధాని మాస్కోలోని డొమొడెవొడో ఎయిర్ ఎయిర్‌పోర్ట్ నుండి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకు కుప్పకూలిపోయింది.

అర్గునోవ్ గ్రామ సమీపంలోనిే విమానం కుప్పకూలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాడార్‌ సిగ్నల్స్‌కు అందకుండా పోయింది. దీంతో అర్గునవ్ సమీపంలో విమానం కూలిపోయిందన్నారు.

Passenger plane with 71 aboard crashes near Moscow, Russian officials say

మాస్కోకు వాయివ్యంగా ఉన్న అర్గునోవ్ సమీపంలో విమానం కూలిందని అధికారులు చెబుతున్నారు. సంఘటనాస్థలంలో సహయక బృందాలు గాలింపు చర్యలను చేపట్టాయి. ఈ విమానంలో 65 మంది ప్రయాణీకులున్నారు.

వారితో పాటు మరో ఆరుగురుు విమాన సిబ్బంది ఉన్నారు.ఈ ప్రమాదంలో అందరూ కూడ చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A passenger plane with 71 people aboard crashed Sunday outside Moscow, Russian officials said. Saratov Airlines flight 703, from Moscow’s Domodedovo airport to the city of Orsk on the Kazakhstan border.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి