11వ సారి యూఎన్ ఎమర్జెన్సీ మీటింగ్, రష్యా ఉక్రెయిన్‌పై గుట్రెస్ ఫైర్, శాంతి అంటూ..
రష్యా ఉక్రెయిన్ తొలి దఫా చర్చలు విఫలం అయ్యాయి. దీంతో అంతర్జాతీయ సమాజం భయాందోళన చెందుతుంది. మరోవైపు రష్యా.. అణ్వాయుధాలు ప్రయోగించడానికి సిద్దం అవుతుంది. ఇటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశం జరిగింది. జనరల్ అసెంబ్లీ ఎమర్జెన్సీగా మీట్ కావడం ఇదీ 11వ సారి.. అత్యవసరం అయితే తప్ప సమితి సమావేశం కాదు.

శాంతి
యుద్దం నేపథ్యంలో సభ్యులు అంతా నిమిషం మౌనం పాటించి.. సమావేశం ప్రారంభించారు. తొలుత జనరల్ సెక్రటరీ ఆంటెరియో గుట్రెస్ మాట్లాడారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కాల్పుల విరమణ చేపట్టాలని స్పష్టంచేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రాణ నష్టం చాలు.. యుద్దం ఆపాలని కోరారు. శాంతి ద్వారా ఏదయినా సాధ్యం అవుతుందని ఆయన చెప్పారు. యుద్ధం ఒరిగేది శూన్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ లెక్క
అలాగే ఉక్రెయిన్ ప్రతినిధి మాట్లాడారు. రష్యా యుద్దంతో తమ దేశానికి చెందిన 352 మంది చనిపోయారని తెలిపారు. వీరిలో 16 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. తమ కంటే రష్యాకే ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. ఆ దేశం వెయ్యి మంది ప్రాణాలను కోల్పోయిందని చెప్పారు.

ఎందుకు అంటే
తర్వాత రష్యా ప్రతినిధి సభలో మాట్లాడారు. ఉక్రెయిన్, జార్జియా నాటోలో చేరాలని అనుకోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. అమెరికా యాంటీ రష్యా విధానం అవలంభిస్తోందని తెలిపారు. అందుకోసమే నాటోలో చేర్చాలని అనుకుంటుందని తెలిపారు. ఉక్రెయిన్ నాటోలో చేరడం చివరి అంకానికి చేరిందని.. అందుకోసమే తాము స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. తమకు ఇదీ నచ్చలేదని స్పష్టంచేశారు.

విఫలం
అంతకుముందు ఉక్రెయిన్ రష్యా చర్చలు విఫలం అయ్యాయి. దాదాపు 3 గంటలు డిస్కష్ చేసిన కొలిక్కి రాలేదు. ప్రపంచ దేశాలు భయపడినట్టుగానే అయ్యింది. యుద్ధంతో హోరాహోరీగా తలపడుతున్న రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సోమవారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బెలారస్ వేదికగా జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తమ తమ వాదనలకే కట్టుబడి సాగాయి. డిమాండ్లను ఇరు దేశాలు కూడా పరిగణనలోకి తీసుకులేదు. దీంతో ఒక తీర్మానం కూడా జరగకుండానే ముగిశాయి.












Click it and Unblock the Notifications