Pentagon Metro Shooting: అమెరికా రక్షణ కేంద్రం వద్ద భీకర కాల్పులు -పోలీసుల మృతి, లాక్‌డౌన్
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. అయితే, ఈ దఫా దేశ రక్షణ కేంద్రం పెంటగాన్ కాల్పులకు కేంద్రమైంది. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ వద్ద మెట్రో రైల్ స్టేషన్ లో గురువారం ఉదయం(స్థానిక కాలమానం ప్రకారం) కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఓ సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో మెట్రో స్టేషన్ లో రక్తపాతం జరిగిందని, ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డట్లు తెలుస్తోంది. మెట్రో స్టేషన్ లో వరుస కాల్పులు వినబడగానే పెంటగాన్ కార్యాలయాన్ని హుటాహుటిన లాక్ డౌన్ చేశారు.

పెంటగాన్ ట్రాన్సిట్ సెంటర్‌లో జరిగిన సంఘటన కారణంగా ప్రస్తుతం పెంటగాన్ లాక్ డౌన్‌లో ఉందని, ప్రజలెవరూ దయచేసి అటు వైపుగా రావొద్దని పెంటగాన్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేసింది.

Recommended Video
ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు.. సాయుధుడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పెంటగాన్ మెట్రో కాల్పుల ఉదంతంతో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..












Click it and Unblock the Notifications