వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : కరోనా వైరస్‌తో ఆ బ్లడ్ గ్రూప్ వారికి ముప్పు ఎక్కువ..

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వ్యాక్సిన్ తయారీకి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతుండటంతో.. కరోనా ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇదే క్రమంలో కరోనా వైరస్‌ గుట్టు తేల్చేందుకు పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా పరిశోధనల్లో ఒకింత భయాందోళనకు గురిచేసే విషయం వెలుగుచూసింది.

ఏ బ్లడ్ గ్రూపువారికి రిస్క్ ఎక్కువ..

ఏ బ్లడ్ గ్రూపువారికి రిస్క్ ఎక్కువ..

మిగతా బ్లడ్ గ్రూపులతో పోలిస్తే.. ఏ గ్రూపు వారిపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. చైనాలో వాంగ్ జింగ్‌యూన్ అనే పరిశోధకుడి నేత్రుత్వంలో వుహాన్ యూనివర్సిటీలోని జోంగ్‌నాన్ అనే ఆసుపత్రిలో ఈ పరిశోధనలు జరిపారు. దాదాపు 2వేల మంది బ్లడ్ నమూనాలను పరిశీలించగా.. ఇందులో మృత్యువాతపడ్డ 206 మందిలో ఏ బ్లడ్ గ్రూపు వారు 85 మంది ఉన్నట్టు గుర్తించారు. వీరికి కరోనాతో ముప్పు ఎక్కువ అని.. మిగతావారి కంటే మరింత మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుందని గుర్తించారు. అదే సమయంలో ఓ బ్లడ్ గ్రూపు వారిపై కరోనా ముప్పు తక్కువని గుర్తించారు.

పరిశోధనా వివరాలు..

పరిశోధనా వివరాలు..

ఈ తాజా పరిశోధనను ఇతర అకడమిక్ టీమ్స్ ఇంకా పరిశీలించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించిన చికిత్సలో రక్త నమూనాలపై ఫోకస్ చేయాలని ఆ పరిశోధనను చేపట్టిన బృందం ప్రభుత్వాన్ని,వైద్యులను కోరుతోంది. వ్యాధి సంక్రమణలో బ్లడ్ గ్రూపు తేడాలను గుర్తించాలని కోరింది. చైనా జనాభాలో సాధారణంగా ఓ బ్లడ్ గ్రూప్(34శాతం) సంఖ్య ఏ బ్లడ్ గ్రూప్(32శాతం) కంటే ఎక్కువ ఉన్నట్టు ఆ బృందం గుర్తించింది. తమ పరిశోధనల్లో కోవిడ్-19 మరణాల్లో 41శాతం ఏ బ్లడ్ గ్రూపు వారు ఉన్నట్టు తేలగా.. 25శాతం ఓ బ్లడ్ గ్రూపు వారు ఉన్నట్టు తేలింది.

Recommended Video

కరోనావైరస్ India update: State Wise Total Number Of Confirmed Cases
భయపడాల్సిందేమీ లేదంటున్న పరిశోధకులు..

భయపడాల్సిందేమీ లేదంటున్న పరిశోధకులు..

తాజా పరిశోధనపై స్టేట్‌ కీ లాబోరేటరీ ఆఫ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ హెమటాలజీ చెందిన గావ్ యింగ్‌డాయ్ మాట్లాడుతూ.. ఈ పరిశోధన మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ఉపయోగపడుతుందన్నారు. అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ పరిశోధన గురించి తెలిసి.. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిశోధనల్లో అలా తేలినంత మాత్రాన.. ఏ బ్లడ్ గ్రూప్‌వారికి 100శాతం కరోనా సోకుతుందని భావించవద్దన్నారు. అలాగే ఓ బ్లడ్ గ్రూప్ వారికి రిస్క్ తక్కువ అని తేలినంత మాత్రాన.. వారు పూర్తిగా సేఫ్ అని భావించరాదన్నారు.

English summary
Experts in China have found that people with blood type A are more vulnerable to the strain of coronavirus, whereas people with type O seem to be more resistant. After analysing the blood patterns of more than 2,000 infected patients in China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X