ఆకాశంలో అత్యద్భుతం- పంచగ్రహ కూటమి కనువిందు
న్యూఢిల్లీ: అంతరిక్షం.. అద్భుతాలకు నిలయం. అంతు చిక్కని బ్రహ్మపదార్థం. అనంత విశ్వంలో ఏం జరుగుతోందనే విషయంపై శాస్త్రవేత్తలు దశాబ్దాల తరబడి పరిశోధనలు చేస్తున్నప్పటికీ.. తెలుసుకున్నది గోరంతే. తెలుసుకున్న ప్రతి అంశం కూడా వింతగానే అనిపిస్తుంటుంది. అంతు లేని, అద్భుతాలు రోజూ ఆవిష్కృతమౌతూనే ఉంటాయి. అలాంటి ఓ అద్భుతమే మరోసారి ఆకాశంలో కనువిందు చేసింది.
మంగళవారం సూర్యాస్తమయం తరువాత ఆకాశంలో పంచ గ్రహాలు ఒకే వరుసలో సాక్షాత్కరించాయి. చంద్రుడితో కలిసి ఆర్క్ రూపంలో దర్శనం ఇచ్చాయి. బుధుడు, శుక్రుడు, గురు, అంగారక, యురేనస్ గ్రహాలు ఒకే వరుసలో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష పరిశోధకులు, ఖగోళ శాస్త్రవేత్తలు, స్టార్ గేజర్స్ ఈ అద్భుతాన్ని ఆసక్తితో తిలకించారు. దీనికి ప్లానెటరీ పరేడ్ అని పేరు పెట్టారు. ఇదొక అత్యంత అరుదైన సెలెస్టియల్ ఈవెంట్ గా అభివర్ణించారు.

సూర్యాస్తమయం తరువాత పశ్చిమ దిశగా పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇందులో మూడు మాత్రమే సాధారణ కంటికి కనిపించాయి. భూమికి సుదూరంగా సంచరిస్తోండటం, మిగిలిన వాటి స్థాయిలో ప్రకాశవంతం కాకపోవడం వల్ల బుధగ్రహం, యురేనస్ లను చూడటానికి టెలిస్కోప్, బైనాక్యులర్‌తో వీక్షించారు స్టార్ గేజర్స్. గురు, శుక్ర గ్రహాలు అత్యంత ప్రకాశవంతంగా కనిపించాయి. ప్రత్యేకించి- యురేనస్ గ్రహాన్ని తిలకించే అవకాశం రావడాన్ని ఓ అద్భుతంగా భావిస్తోన్నారు.

ఈ గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగడానికి పట్టే సమయం 84 సంవత్సరాలు. మళ్లీ ఇది ఇలా మిగిలిన గ్రహాలతో కలిసి ఒకే వరుసలో ఏర్పడటానికి 84 సంవత్సరాలు పడుతుంది. ఆ అవకాశం ఇప్పడు వచ్చింది. మళ్లీ యురేనస్ ను భూమి నుంచి తిలకించడానికి 84 సంవత్సరాలపాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఎర్త్ హారిజన్ లైన్ కు అత్యంత సమీపంలో ఉన్నందున సూర్యాస్తమయం తరువాత అరగంటకే బుధుడు, బృహస్పతి గ్రహాలు కనుమరుగయ్యాయి.












Click it and Unblock the Notifications