పెట్రోల్ పట్టుకుంటుంటే: 73 సజీవదహనం
బీరా: పెట్రోల్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ట్యాంకర్ పేలిపోయి 73 మంది సజీవదహనం అయిన ఘటన ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశంలో జరిగింది. మొజాంబిక్ దేశంలోని బీరా నగరం నుంచి మలావికి ఓ పెట్రోల్ ట్యాంకర్ బయలుదేరింది.

మార్గం మధ్యలో శుక్రవారం వేకువ జామున (భారత కాలమానం ప్రకారం) టెటె ఏరియాలోని ఓ గ్రామం దగ్గర పెట్రోల్ ట్యాంకర్ నిలిపారు. అక్కడ పెట్రోల్ కొనుగోలు చెయ్యడానికి గ్రామస్తులు వెళ్లారు.
ఆ సమయంలో ట్యాంకర్ ఒక్క సారిగా పేలిపోయింది. పెట్రోల్ పట్టుకోవడానికి వచ్చిన 73 మంది గ్రామస్తులు సజీవదహనం అయ్యారు. 100 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులకు చికిత్స చేయిస్తున్నామని, కేసు విచారణలో ఉందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications