వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pfizer pill: ఒమిక్రాన్‌కూ విరుగుడు: త్వరలో మాత్రలు: 89 శాతం ఎఫీషియన్సీ: భారీగా ఆర్డర్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటిదాకా భారత్ సహా 70 దేశాలకు వ్యాప్తి చెందింది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ వేరియంట్‌కు చెందిన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారిన పడి అత్యధిక పాజిటివ్ కేసులు, అదే స్థాయిలో మరణాలను నమోదు చేసిన దేశం అది. కరోనా వైరస్ వల్ల అమెరికాలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు. అయిదు కోట్లకు పైగా పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. కొత్తగా ఒక్కరోజులోనే లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదు కావడం కలకలం రేపుతోంది.

ఒమిక్రాన్ భయం..

ఒమిక్రాన్ భయం..


కరోనా వైరస్ కల్లోల పరిస్థితులు కొనసాగుతుండగానే.. ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ సైతం వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతానికి ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పరిమితంగానే ఉంటోంది. అయినప్పటికీ పలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నియుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తోంది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లను అక్కడ వినియోగిస్తోన్నారు.

 త్వరలో ఫైజర్ పిల్స్

త్వరలో ఫైజర్ పిల్స్


ఈ క్రమంలో తాజాగా మాత్రలను కూడా అందుబాటులోకి తీసుకుని రానుంది. కోవిడ్‌తో పాటు దాని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పైన కూడా అత్యంత ప్రభావవంతంగా పని చేసేలా మాత్రలను వినియోగించడానికి చర్యలు తీసుకుంటోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఫైజర్.. ఈ మాత్రలను అభివృద్ధి చేసింది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ సైతం పూర్తి చేసింది. వాటికి పూర్తి క్లినికల్ డేటాను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ (యూఎస్ఎఫ్‌డీఏ)కి పంపించింది. కరోనా వైరస్‌పై దీని ఎఫీషియన్సీ 89 శాతంగా నిర్ధారించింది ఫైజర్.

10 మిలియన్ల మందికి సరిపడేలా ఆర్డర్

10 మిలియన్ల మందికి సరిపడేలా ఆర్డర్


కరోనా వైరస్‌తో పాటు దాని కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పైనా ఫైజర్ పిల్స్ పనితీరు ఆశించిన విధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. 10 మిలియన్ల మందికి సరిపడేలా ఫైజర్ ట్యాబ్లెట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. త్వరలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దీన్ని చేర్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కోవిడ్ బారిన పడి.. కోలుకున్న వారిలో తలెత్తే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్, ఇతర అనారోగ్య లక్షణాలను కూడా ఫైజర్ పిల్ నిర్మూలించగలదని ఆయన స్పష్టం చేశారు.

 కరోనాపై పోరులో కొత్త ఆయుధంగా..

కరోనాపై పోరులో కొత్త ఆయుధంగా..

కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్‌పైనా తాము చేస్తోన్న పోరాటంలో- ఫైజర్ పిల్ ఓ శక్తిమంతమైన ఆయుధంగా మారుతుందని జో బైడెన్ చెప్పారు. ఇప్పటికే 10 మిలియన్ల మందికి వైద్యాన్ని అందించడానికి అవసరమైన మాత్రలకు ఆర్డర్ ఇచ్చామని అన్నారు. ఈ ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడానికి ఇంకొంత సమయం పడుతుందని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి అనుమతి ఇవ్వడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలు ఎఫ్‌డీఏ పరిశీలనలో ఉన్నాయని జో బైడెన్ వివరించారు. త్వరలోనే దీనికి అన్ని రకాల అనుమతులు లభిస్తాయని, ఆ వెంటనే ఈ ఫైజర్ పిల్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తామని ఆయన తేల్చి చెప్పారు.

ఎనిమిది లక్షలమందికి పైగా బలి..

ఎనిమిది లక్షలమందికి పైగా బలి..


కాగా- కరోనా వైరస్ వల్ల అత్యధికంగా నష్టపోయింది అమెరికా. అమెరికాలో కల్లోలాన్ని మిగిలించిందీ మహమ్మారి. ఇప్పటిదాకా- 8,21,325 మంది ఈ వైరస్‌కు బలి అయ్యారు. 5,11,35,983 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ప్రతి రోజూ కొత్త కేసులు వెలుగులోకి వస్తూనేే ఉన్నాయి. తాజాగా 1,08,107 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌గా ఉన్న కేసులు 1,00,84,345. కాలిఫోర్నియా, టెక్సాస్‌లల్లో అత్యధిక మరణాలు రికార్డయ్యాయి. కాలిఫోర్నియా-75,676, టెక్సాస్-75,126 మంది మరణించారు.

English summary
US President Joe Biden said that the Pfizer pill is provides another potentially powerful tool in our fight against virus, including Omicron variant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X