Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందంగా ఉన్నంత కాలం అత్యాచారాలు జరుగుతాయి: అధ్యక్షుడి దారుణ వ్యాఖ్యలు

దావోయ్: ఫిలిప్సీన్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెట్రే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళలు అందంగా ఉన్నంత కాలం అత్యాచారాలు జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సరదాగా అన్నప్పటికీ ఆ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని అంటున్నారు.

ఆయన తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వేదిక మీదున్న ఓ మహిళను ఆయన ముద్దు అడిగి కొద్ది నెలల క్రితం వివాదం సృష్టించారు. ఇప్పుడు మహిళలపై జరిగే అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 Philippine President Rodrigo Duterte blames beautiful women for rape cases

ఫిలిప్పైన్స్‌లో దావోయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళల గురించి, విజయ సూత్రాల గురించి, ప్రపంచంలో శక్తిమంతమైన వ్యక్తుల గురించి మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మాట్లాడారు. ఇందులో భాగంగా ఈయన వివాదాస్పదంగా జోక్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

దావోయ్‌లోనే ఈ మధ్యకాలంలో అత్యాచార ఘటనలు ఎక్కువయ్యాయని, ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువగా ఉందని, అందమైన స్త్రీలమీదనే అత్యాచారాలు ఎక్కువగా జరగుతుంటాయని, మహిళలపై అత్యాచార దాడి జరిగినప్పుడు వాళ్లు తిరస్కరిస్తేనే అది అత్యాచారం అవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం చేశాయి. రోడ్రిగో క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+