షాక్: కుప్పకూలిన సైనిక విమానం -భారీగా జవాన్ల మృతి -ఉగ్రవాదులపై పోరుకు వస్తుండగా..

ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం 92 మంది జవాన్లతో వెళుతోన్న సైనిక విమానం సి-130 కుప్పకూలడంతో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఉగ్రవాదులపై పోరాడేందుకు వస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరగడంతో అనుమానాలు పెరిగాయి. ఫిలిప్పీన్స్ అధికారులు చెప్పిన వివారల ప్రకారం..

ఫిలిప్పీన్స్ మెయిన్ ల్యాండ్ నుంచి సులు ఫ్రావిన్స్ పరిధిలోని జోలో ద్వీపానికి ఆదివారం ఓ సైనిక విమానం బయలుదేరింది. సి-130 మోడలైన ఆ విమానంలో మొత్తం 92 మంది సైనికులున్నారు. వారంతా కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన సుశిక్షితులు. జోలో ద్వీపంలో ఇటీవల ఉగ్రవాద కార్యకాలాపాలు పెరగడంతో వానిని నివారించేదుకు అదనపు బలగాలను అక్కడికి చేరవేస్తున్నారు. ఈ క్రమంలో..

మెయిన్ లాండ్ నుంచి జోలో ద్వీపానికి చేరుకున్న సైనిక విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్‌వేను చేరుకోవడంలో విఫలమైంది. పైలట్ విమానంపై పట్టుకోల్పోవడంతో అది సమీపంలోని అడవిలో కుప్పకూలింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి పరుగులు తీశాయి. విమానంలోని సైనికులంతా ఇటీవలే ప్రాథమిక సైనిక శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లని సమాచారం.

philippines plane crash: C-130 military plane Carrying 92 crashes in Jolo, several died

జోలో ద్వీపంలో ఫిలిప్పీన్స్ ఆర్మీ విమాన ప్రమాదంలో ఇప్పటి దాకా 40 మంది కాపాడినట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటిదాకా 17 మంది జవాన్లు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారని, గాయపడినవాళ్లను ఆస్పత్రులకు తరలించామని వివరణ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరు కోసం ఏర్పాటైన జాయింట్ ఫోర్స్ లో చేరేందుకు సైనికుల్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కాగా, ఈ ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+