బుడుతడిని కదిలించిన విగ్రహం : అమ్మే అనుకుని, స్థన్యాన్ని..

Subscribe to Oneindia Telugu

ఆస్ట్రేలియా : ఆకలేసిందో.. లేక అమ్మనే ఎదురుగా ఉందనుకున్నాడో తెలియదు గానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిన్నారి బుడతడు విగ్రహం స్థన్యాన్ని నోట్లో పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జీవం లేని ఓ విగ్రహం చిన్నారి బుడుతడిని అంతలా ఆకర్షించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆస్ట్రేలియాకు చెందిన ఓ తల్లి తన చిన్నారి కొడుకును ఎత్తుకుని ఓ మ్యూజియంను సందర్శించడానికి వెళ్లింది. మ్యూజియంలో వస్తువులను తిలకిస్తున్న సమయంలో ఓ అర్థనగ్న మహిళా చిత్రం దగ్గరికి రాగానే తన చేతుల్లో ఉన్న బుడతడు ఉన్నట్టుండి అటువైపు తిరిగాడు. అక్కడితో ఆగకుండా అమ్మ చేతుల్లో నుంచి ఇంకొంచెం ముందుకు జరిగి విగ్రహం స్థన్యాన్ని నోట్లో పెట్టుకున్నాడు.

baby

కొడుకు చేసిన ఈ పనికి తల్లితో పాటు అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకున్నారు. అయితే అక్కడే ఉన్న ఫోటో గ్రాఫర్ బుడుతడు పాలు తాగేందుకు ప్రయత్నిస్తున్న ఫోటోలను తన కెమెరాతో క్లిక్ మనిపించాడు. అనంతరం వాటిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. అయితే, కొంతమంది నెటిజెన్లు మాత్రం సదరు తల్లి తీరును తప్పుబడుతూ ఫేస్ బుక్ లో కామెంట్స్ పెడుతున్నారు.

ఆ బుడుతడికి ఎంతగా ఆకలై ఉంటే.. అలా విగ్రహం స్థన్యాన్ని నోట్లో పెట్టుకుని పాలు తాగడానికి ప్రయత్నిస్తాడంటూ తల్లిని తప్పుబడుతున్నారు. పాలివ్వకుండా బిడ్డను ఆకలితో చంపేస్తోందంటూ మరికొంతమంది ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదంతా ఇలా ఉంటే.. బుడుతడు పాలు తాగడానికి ప్రయత్నించిన ఆ విగ్రహం ఇప్పుడు చర్చల్లో నానుతోంది. దాన్ని రూపొందించిన శిల్పి, జీవం ఉట్టిపడేట్టుగా దాన్ని తయారు చేయడంతోనే, బుడుతడు అలా స్పందించాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
But their 'boring' reputation and the requirement of silence also makes them a nightmare for anyone with young children.However one toddler thought he had struck gold on his day out to the museum, discovering what he thought was a 'free snack'.The hungry young boy was pictured escaping the hold of his mother to suck on the bare breast of a porcelain statue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X