తలలకు గురిపెట్టి కాల్చారు: పెషావర్ తాలిబన్ల ఫోటో రిలీజ్ (పిక్చర్స్)

పెషావర్: పాకిస్తాన్‌లో చిన్నారులను పొట్టన పెట్టుకున్న తాలిబన్లు తమ చర్యను సమర్థించుకున్నారు. పెషావర్ సైనిక పాఠశాల పైన దాడి చేసి 132 మంది విద్యార్థులు సహా మొత్తం 148మందిని కాల్చి చంపారు. విద్యార్థులను కాల్చి చంపిన కిరాతకుల ఫోటోలను తాలిబన్లు విడుదల చేశారు.

తమ యోధుల కుటుంబాలను, వారి చిన్నారులను పాకిస్తాన్ సైన్యం ఎంతోకాలం నుండి చంపేస్తోందని, అందుకు ప్రతిగానే ఈ దాడి చేశామని పాకిస్తాన్ తాలిబన్లు తమ ప్రకటనలో తెలిపారు. తాలిబన్ల ప్రతినిధి మహ్మద్ ఖురసానీ మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. సైనిక స్థావరాల నుండి పౌరులు వెళ్లిపోవాలని, లేదంటే దాడులకు బలవుతారని హెచ్చరించారు.

పెషావర్‌లోని సైనిక్ స్కూల్లో తాలిబన్ మానవబాంబులు ముక్కుపచ్చలారని చిన్నారులు సహా ఉపాధ్యాయులను ఊచకోత కోయడానికి నిరసనగా పాకిస్తాన్ అంతటా మూడు రోజుల జాతీయ సంతాప దినాలను బుధవారం నుంచి పాటిస్తున్నారు. సంఘటన జరిగిన ఖైబర్-ఫఖ్తూన్‌ఖ్వా రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలను మూసివేసారు.

ప్రధాని నవాజ్ షరీఫ్ మూడు రోజులు జాతీయ సంతాప దినాలు ప్రకటించిన దృష్ట్యా ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాలను అవనతం చేసారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పాఠశాలలు మామూలుగానే తెరిచినప్పటికీ ఉదయం ప్రార్థనా సమావేశాల్లో దాడిని ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంతాప సూచకంగా వౌనం పాటించారు. జంటనగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండి సహా పలు నగరాల్లో కొవ్వొత్తి ర్యాలీలు నిర్వహించారు.

ఉగ్రవాదులు విడుదల చేసిన ఫోటో

ఉగ్రవాదులు విడుదల చేసిన ఫోటో

పాకిస్తాన్‌లో చిన్నారులను పొట్టన పెట్టుకున్న తాలిబన్లు తమ చర్యను సమర్థించుకున్నారు. పెషావర్ సైనిక పాఠశాల పైన దాడి చేసి 132 మంది విద్యార్థులు సహా మొత్తం 148మందిని కాల్చి చంపారు. విద్యార్థులను కాల్చి చంపిన కిరాతకుల ఫోటోలను తాలిబన్లు విడుదల చేశారు.

నవాజ్ షరీఫ్

నవాజ్ షరీఫ్

తాలిబన్ల దాడిలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ విద్యార్థిని పరామర్శిస్తున్న పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్.

బ్లాక్ డే

బ్లాక్ డే

పెషావర్ తాలిబన్ల దాడి ఘటనలో 132 మంది విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతికి సంతాపంగా ముంబైలో విద్యార్థులు...

నో టెర్రర్

నో టెర్రర్

పెషావర్ తాలిబన్ల దాడి ఘటనలో 132 మంది విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రవాదానికి స్వస్తి చెప్పాలంటూ పాకిస్తాన్‌లో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం.

అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించగా, రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరుతామంటూ ప్రతినబూనాయి. నిన్న రాత్రి ప్రారంభమైన మృతుల అంత్యక్రియలు బుధవారం కూడా కొనసాగాయి. అంత్యక్రియల సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

కాగా, సైనిక స్కూల్‌పై జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమాన కంపెనీలు వెల్లడించినట్లు ఓ వార్తాసంస్థ ప్రచురించింది.

అలాగే ఎమిరేట్స్ విమాన సర్వీసులను సైతం తక్షణం రద్దుచేస్తున్నట్లు ప్రకటించిందని పిటిఐ వార్తాసంస్థ వెల్లడించింది. పెషావర్‌కు వెళ్ళే అన్ని విమాన సర్వీసులను డిసెంబర్ 16నుంచి రద్దు చేస్తున్నామని, తదుపరి ప్రకటన వెలువడే వరకూ పెషావర్‌కు విమాన సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొంది. అయితే, కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, సియాల్‌కోట్ నగరాలకు విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.

ఉగ్రవాద కేసుల్లో మరణశిక్షలు విధించడంపై పాక్ తనకు తానుగా విధించుకున్న మారటోరియంను ప్రధాని నవాజ్ షరీఫ్ ఎత్తివేసారు. పెషావర్‌లోని సైనిక పాఠశాలలో ఉగ్రవాదులు విద్యార్థులు, సిబ్బందిని కాల్చి చంపిన ఒక రోజు తర్వాత బుధవారం పెషావర్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో షరీఫ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

పెషావర్‌లోని సైనిక పాఠశాలలో కాల్చి చంపిన విద్యార్థుల్లో చాలామందిని తాలిబన్ మానవబాంబులు అత్యంత దగ్గరి నుంచి తలకు తుపాకులు గురిపెట్టి కాల్చి చంపేసారు. సైనిక యూనిఫామ్‌లో ఉన్న మిలిటెంట్లు పాఠశాలకు ఆనుకుని ఉన్న శ్మశానవాటిక గుండా పాఠశాల ప్రహరీ గోడ ఎక్కి పాఠశాలలో ప్రవేశించిన తర్వాత తరగతి గదులు, ఆడిటోరియం వైపు కదిలే సమయంలో కాల్పులు జరపడం ప్రారంభించారని ఈ దాడిలో ప్రాణాలతో బైటపడిన విద్యార్థులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+