కాక్ పీట్ లో ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్
లండన్/ లాహోర్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆదేశ ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె గారు చేసిన పనికి ఓ పైలెట్ పీకల మీదకు వచ్చింది.
అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తూ కాక్ పీట్ లోకి వెళ్లి కొన్ని నిమిషాల పాటు కూర్చుని పైలెట్ తో పిచ్చపాటిగా మాట్టాడిన రెహమ్ ఖాన్ ఇప్పుడు అదే పైలెట్ కష్టాల్లో పడటానికి కారణం అయ్యారు.
గురువారం లండన్ నుంచి లాహోర్ కు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిల్ లైన్స్ (పీఐఏ)కు చెందిన పీకే- 788 విమానం బయలుదేరింది. ఇదే విమానంలో రెహమ్ ఖాన్ లాహోర్ బయలుదేరారు. మార్గం మద్యలో ఆమె కాక్ పీట్ లోకి వెళ్లారు.

తాను ఇక్కడ కుర్చుంటానని పైలెట్ కు చెప్పారు. అందుకు పైలెట్ సరే అంటూ తల ఊపాడు. రెహమ్ కొన్ని నిమిషాల పాటు అక్కడే కూర్చుని ఎంజాయ్ చేశారు. తరువాత ఆమె సీట్ దగ్గరకు వెళ్లి పోయారు.
విషయం పీఐఏకి తెలిసింది. అంతే పైలెట్ మీద కన్నెర్ర జేసింది. అనధికారిక వ్యక్తులను కాక్ పీట్ లో ప్రవేశించడానికి అనుమతి లేదని, రెహమ్ కాక్ పీట్ లోకి ప్రవేశించడానికి కారణం అయిన పైలెట్ మీ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పైలెట్ నియమ నిబంధనలను ఉల్లంఘించారని స్పష్టంగా తెలుస్తుందని అంటున్నారు. టీవీ జర్నలిస్టుగా పని చేసిన రెహమ్ ఖాన్ 2015 జనవరిలో ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకునింది. గత అక్టోబర్ 30వ తేదిన ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి రెహమ్ ఖాన్ వార్తల్లో నిలుస్తున్నారు.
-
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications