వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవంతంగా: ప్లూటో గ్రహం నుండి నాసాకు ఫోన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్లూటో గ్రహానికి తొలిసారిగా అత్యంత చేరువగా వెళ్లిన నాసాకు చెందిన న్యూ హారిజన్స్ వ్యోమనౌక ఫ్లూటోకు అత్యంత సమీపంనుంచి తన ప్రయాణం విజయవంతమైందని ధ్రువీకరించింది. దాదాపుగా 300 కోట్ల మైళ్ల దూరంనుంచి నాసా కేంద్రానికి ఫోన్ చేసింది.

చరిత్రలో మొట్టమొదటి సారి ప్లూటో గ్రహానికి అత్యంత చేరువనుంచి తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రపంచానికి తెలియజేస్తూ న్యూ హారిజన్స్ వ్యోమనౌక ఫోన్ చేసిందని నాసా బుధవారం తెలిపింది.

వాస్తవానికి ప్లూటో గ్రహానికి అత్యంత చేరువనుంచి ఈ వ్యోమనౌక ప్రయాణించిన 13 గంటల తర్వాత వ్యోమనౌక తాను విజయవంతంగా ఈ యాత్రను పూర్తి చేసినట్లు నాసా మిషన్ కంట్రోల్ కేంద్రానికి ముందుగా సెట్ చేసి ఉంచిన ఫోన్ సందేశాన్ని పంపించింది.

Pluto probe survives encounter, phones home

మంగళవారం ప్లూటో గ్రహానికి అత్యంత చేరువగా ప్రయాణించే సమయంలో ఆ గ్రహానికి చెందిన డేటాను సేకరించడం కోసం వ్యోమనౌక తన యాంటెనాలన్నిటినీ ఆ గ్రహం వైపు మళ్లించడంతో అది మిషన్ కంట్రోల్ కేంద్రానికి సిగ్నల్స్‌ను పంపించడం ఆపేసింది.

వ్యోమనౌక తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ధ్రువీకరిస్తూ సందేశం పంపించిన తర్వాత అది ఇక ప్లూటోకు సంబంధించి హై రిజల్యూషన్ ఫోటోలతో పాటుగా బోలెడంత డేటాను మిషన్ కంట్రోల్‌కు పంపించడం ప్రారంభిస్తుంది.

కాగా, తొమ్మిదేళ్లకు పైగా దాదాపు 300 కోట్ల మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత న్యూ హారిజన్స్ వ్యోమనౌక మంగళవారం ప్లూటో గ్రహానికి అత్యంత చేరువనుంచి అంటే కేవలం 12,500 మైళ్ల దూరంనుంచి వెళ్లింది.

English summary
A US spacecraft sailed past the tiny planet Pluto in the distant reaches of the solar system on Tuesday, capping a journey of 3 billion miles (4.88 billion km) that began nine and a half years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X