దాడి చేస్తే మోడీ తగ్గరు యుద్ధమే, పాక్‌కూ తెల్సు: యూఎస్ 'మాజీ' హెచ్చరిక
వాషింగ్టన్: భారత దేశంలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు మరోసారి ఉగ్రదాడి చేస్తే భారత ప్రధాని నరేంద్ర మోడీ గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు! పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో దాడులకు పాల్పడితే ప్రధాని మోడీ సైనిక చర్యను ఉపయోగించవచ్చునని మాజీ టాప్ యూఎస్ దౌత్యవేత్త రాబర్ట్ బ్లాక్‌విల్ హెచ్చరించారు.
ఆయన గతంలో భారత్‌లో అమెరికా రాయబారిగా పని చేశారు. గతంలో వలె ప్రవర్తిస్తే తమకే కీడు జరుగుతుందని పాకిస్తాన్‌కు కూడా తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోలా ప్రవర్తిస్తే ఇప్పుడు మోడీ ఏమాత్రం సహించరని పాక్‌కు తెలుసునని చెప్పారు.
పార్లమెంటు పైన దాడి జరిగి 15 ఏళ్లు అవుతోందని ఆయన గుర్తు చేశారు. ఈ దాడి జరిగినప్పటి నుండి ప్రతి భారత ప్రధాని కూడా.. అందుకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు మిలటరీ యాక్షన్‌ను ఉపయోగించాలని భావించినప్పటికీ, వెనక్కి తగ్గారన్నారు.

క్రమంగా భారత్‌లో సెంటిమెంట్స్ మారిపోయాయని, ఇప్పటి ప్రధాని (మోడీ) అలాంటి దానికి వెనక్కి పోకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.
ఒకవేళ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ మిలటరీ, ఐఎస్ఐ తదితరాల దాడి జరిగితే ఈ ప్రధాని (మోడీ) పాకిస్తాన్ పైన మిలటరీ ఫోర్స్‌ను ఉపయోగించవచ్చునని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా కాకపోయినప్పటికీ.. మోడీ సర్దుకుపోయే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications