చైనా అధ్యక్షుడితో మోదీ - ఉల్లాసంగా షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరింపు: లఢక్ ఘర్షణ తరువాత..!!

జకర్తా: ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జీ20 సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. ఆహారం, ఇంధన భద్రత అంశంపై ఏర్పాటైన వర్కింగ్ సెషన్‌లో కీలకోపన్యాసం చేశారు. ఆహార భధ్రత, ఎరువులు, ఇంధన అవసరాల గురించి ప్రస్తావించారు. ఆహార భద్రత విషయంలో ఎదురయ్యే సవాళ్లన్నింటినీ అన్ని దేశాలు సమష్టిగా పరిష్కరించుకోవాల్సిన ఉందని సూచించారు.

 రెడ్ కార్పెట్..

రెడ్ కార్పెట్..

అంతకుముందు- ప్రధాని మోదీ బాలిలోని అపూర్వ కెంపిన్‌స్కి హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఘన స్వాగతం పలికారు. జీ20 లీడర్స్ సమ్మిట్‌లో ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ సెషన్‌లో పాల్గొన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకున్నారు. వారిద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేశారు. మోదీ ఫుడ్ అండ్ ఎనర్జీ సెషన్‌లో పాల్గొన్న కొద్దిసేపటికే బైడెన్ ఆయనను కలుసుకోవడానికి వచ్చారు.

 మోదీతో బైడెన్..

మోదీతో బైడెన్..

బైడెన్ తనవైపు వస్తోండటాన్ని గమనించిన మోదీ తన కుర్చీ నుంచి లేచి.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేశారు. ఆ సమయంలో అక్కడే నిల్చుని ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌ను బైడెన్‌కు పరిచయం చేశారు మోదీ. కొద్దిసేపు అక్కడే నిల్చుని మాట్లాడారు. ఆ తరువాత మోదీ పక్క కుర్చీలోనే ఆసీనులయ్యారు బైడెన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో ప్రధాని మోదీ కొద్దిసేపు సంభాషించారు.

రిషి సునాక్‌తో..

రిషి సునాక్‌తో..

ఈ సెషన్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలిశారు. జీ20 సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చిన బాలి నుసు దువా కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో మోదీని మర్యాదపూరకంగా కలిశారు రిషి సునాక్. ఈ సందర్భంగా రిషి పలు అంశాలను ప్రస్తావించగా.. వాటిని మోదీ శ్రద్ధగా, ఆసక్తిగా వినడం కనిపించింది. ఒకట్రెండు సందర్భాల్లో ఆయన రిషి సునక్ భుజం తట్టి, ప్రశంసించారు. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్‌ స్థానంలో ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన రిషి సునాక్‌ను మోదీ కలుసుకోవడం ఇదే తొలిసారి.

చైనా అధ్యక్షుడితో..

సాయంత్రం చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌ను కలిశారు ప్రధాని మోదీ. ఇది షెడ్యూల్ భేటీ కాదు. జిన్‌పింగ్‌తో సమావేశం కావాలనేది మోదీ ఇండొనేషియా టూర్ షెడ్యూల్‌లో లేదు. ఇండొనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ రాత్రి ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు యాద‌ృచ్ఛికంగా కలుసుకున్నారు. జిన్‌పింగ్ ఎదురు పడగానే చిరునవ్వుతో పలకరించారు మోదీ. షేక్ హ్యాండ్ ఇచ్చారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

సంప్రదాయ దుస్తుల్లో..

సంప్రదాయ దుస్తుల్లో..

ఆ సమయంలో ఇద్దరూ కూడా క్యాజువల్ దుస్తుల్లో కనిపించారు. ఉదయం అంతా తీరిక లేకుండా సెషన్స్‌లల్లో పాల్గొన్న ఇద్దరు నేతలు ఈ డిన్నర్‌కు క్యాజువల్ దుస్తులతో హాజరయ్యారు. మోదీ ముదురు ఎరుపురంగు కుర్తా, తెలుపు రంగు పైజామా ధరించారు. జిన్‌పింగ్ చైనా సంప్రదాయబద్ధమైన ముదురు నీలం రంగు లాంగ్ కోటును ధరించి కనిపించారు. ఇద్దరు నేతలు పలకరింపుల తరువాత- తమకు కేటాయించిన టేబుల్స్ వద్దకు వెళ్లారు.

తొలిసారిగా..

తొలిసారిగా..

లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, ఆ తరువాత చోటు చేసుకున్న ఘర్షణ, సైనికుల వీరమరణం.. వంటి పరిణామాల తరువాత మోదీ-జిన్‌పింగ్ కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తరువాత భారత్- చైనాపై ట్రేడ్ వార్‌ను ప్రకటించింది. ఆ దేశానికి చెందిన యాప్‌ల వినియోగంపై నిషేధాన్ని విధించింది. దీన్ని చైనా తప్పుపట్టడంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

 అంతకుముందు మహాబలిపురంలో..

అంతకుముందు మహాబలిపురంలో..

అంతకుముందు చెన్నై సమీపంలోని మహాబలిపురంలో మోదీ-జిన్‌పింగ్ భేటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. 2019 అక్టోబర్‌లో జిన్‌పింగ్ భారత పర్యటనకు వచ్చారు. చెన్నైలో బస చేశారు. అప్పట్లో రెండు రోజుల భారత పర్యటన కోసం జిన్ పింగ్ చెన్నైకి వచ్చారు. ఆ భేటీ తరువాత మళ్లీ మోదీ-జిన్‌పింగ్ కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది షెడ్యూల్‌లో లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+