బూర్జ్ ఖలీఫాపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో, త్రివర్ణ పతాకం, ఎందుకంటే?

దుబాయ్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం యూఏఈలో పర్యటించిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని ప్రతిష్టాత్మకమైన బూర్జ్ ఖలీఫాపై భారత జాతీయ పతాకంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ పేరు, ఫొటోలను గ్రాండ్‌గా ప్రదర్శించి ఘనంగా స్వాగతం పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ శనివారం అబుదాబికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి.

PM Modi

సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, వారి చెల్లింపు, సందేశ వ్యవస్థలను ఇంటర్‌లింక్ చేయడానికి భారతదేశం, యూఏఈ సెంట్రల్ బ్యాంక్‌లు రెండు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. "భారత్-యుఎఇ సహకారంలో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది మెరుగైన ఆర్థిక సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక పరస్పర చర్యలను సులభతరం చేస్తుంది' అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, అబుదాబిలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ శాఖను స్థాపించడానికి రెండు దేశాల విద్యా మంత్రిత్వ శాఖలు, IIT-ఢిల్లీ కూడా ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. 'ఇది మా విద్యా అంతర్జాతీయీకరణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. భారతదేశం ఆవిష్కరణ పరాక్రమానికి నిదర్శనం. విద్య అనేది మనల్ని కలిపే బంధం, ఇది ఆవిష్కరణలను వెలిగించే స్పార్క్. కలిసి, మనం ఈ శక్తిని పరస్పర శ్రేయస్సు, ప్రపంచ అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటాము' ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.

కాగా, అధ్యక్ష భవనంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు యూఈఏ అధ్యక్షుడు షేక్ మహ్మద్. స్థానికంగా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారు చేసిన విందును ప్రధాని మోడీకి వడ్డించారు. గోధమలు, ఖర్జూర సలాడ్‌లతో పాటు మసాలా సాస్, కాల్చిన కూరగాయలను స్టార్టర్లుగా అందించారు. ఈ విందుకు విచ్చేసిన ప్రముఖులకు క్యాలీఫ్లవర్, క్యారెట్ తందూరి, నల్ల పప్పు, హారీస్‌లను ప్రధానంగా వడ్డించారు. వీటితోపాటు స్థానికంగా పండించిన పండ్లను కూడా అందించారు. ఈ వంటకాల్లో వాడిన నూనె కూడా కూరగాయలతో తయారు చేసిందే కావడం గమనార్హం. ఈ విందులో పాలు, గుడ్డుతో తయారు చేసిన పదార్థాలు లేవని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+