భారత్ క్షమించరాని తప్పు చేస్తోంది.. ఇదే ఆఖరి వార్నింగ్: పాక్ ప్రధాని

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం సింధూనది జలాల రద్దు విషయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. సింధూనది జలాలపై ఇరు దేశాలకు హక్కు ఉందని స్పష్టం చేశారు. నీళ్ల విషయంపై భారత్ ఏకపక్ష ధోరణి క్షమించరానిదని పాక్ ప్రధాని షరీఫ్ మండిపడ్డారు.

ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 26 మంది టూరిస్టులను కిరాతకంగా చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణులు దాడి చేశాయి. ఆ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు రక్షణశాఖ పేర్కొంది.

అయితే ఆపరేషన్ సింధూర్ చేపట్టక ముందే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్- భారత్ మధ్య ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య వాణిజ్యాలు రద్దు.. తదితర నిర్ణయాలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది భారత్.

అయితే ఆపరేషన్ సింధూర్ ధాటికి పాకిస్థాన్ విలవిల్లాడిపోయింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమైంది. ఈ మేరకు భారత్ కు పాక్ విదేశాంగ కార్యాలయం, ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచి ఫోన్ లు వచ్చినట్లు సీజ్ ఫైర్ కు తాము సిద్ధమని చెప్పినట్లు ఇటీవల భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. దీంతో ఇటీవల రద్దు చేసిన సింధూ జలాల పంపిణీని భారత్ పున సమీక్షించుకోవాలని తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.

PM Shehbaz Sharif Reacts to India s Indus Water Treaty Move

" సింధూ జలాల పంపిణీని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న ఏకపక్షనిర్ణయం క్షమించరానిది. ఇది అనైతికం. అసాంఘీకం. రాజకీయాల లబ్ధికోసం లక్షల మంది ప్రాణాలు కోల్పోవాలా..? పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎప్పటికీ ఒప్పుకోదు" అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తజకిస్థాన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పులు విరమణ జరిగిన తర్వాత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి సిందూ జలాలపై స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తజకిస్థాన్‌లో 'హిమానీనదం రక్షణ' అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సింధూ నదీజలాల ఒప్పందం 1960లో జరిగింది. భారత్- పాకిస్థాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబరు 19న సంతకాలు చేశాయి. అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థ నుండి 20 శాతం నీటిని భారత్ కు.. మిగిలిన 80శాతం నీటిని పాకిస్థాన్ కు ఇవ్వాలని ఈ ఒప్పందంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+