షాకింగ్: ఆ జర్నలిస్టు తల, రెండు కాళ్లు.. ఓ బ్యాగులో దొరికాయి!

అదృశ్యమైన స్వీడన్‌ మహిళా జర్నలిస్టు విగత జీవిగా కనిపించారు. అది కూడా ఓ బ్యాగులో ఆమె తల, కాళ్లు మాత్రమే ముక్కలు ముక్కలుగా లభించాయి. ఈ విషయాన్ని డానిష్‌ పోలీసులు వెల్లడించారు.

కోపెన్ హాగెన్: అదృశ్యమైన స్వీడన్‌ మహిళా జర్నలిస్టు విగత జీవిగా కనిపించారు. అది కూడా ఓ బ్యాగులో ఆమె తల, కాళ్లు మాత్రమే ముక్కలు ముక్కలుగా లభించాయి. ఈ విషయాన్ని డానిష్‌ పోలీసులు వెల్లడించారు. .

సొంతంగా ఓ జలాంతర్గామిని తయారు చేసిన పీటర్‌ మాడ్సన్‌ అనే వ్యక్తిని అదే జలాంతర్గామిలో ఇంటర్వ్యూ చేసేందుకు స్వీడన్‌కు చెందిన జర్నలిస్ట్ కిమ్‌ వాల్‌ వెళ్లింది. ఇంటర్వ్యూ సంగతేమోగానీ, ఆమె శాల్తీయే గల్లంతైంది.

Police find head of murdered Swedish journalist Kim Wall

ఆమెకోసం గాలిస్తున్న పోలీసులకు సముద్రంలో రెండు బ్యాగులు లభించాయి. ఒక బ్యాగ్‌లో ఆమె తల, రెండు కాళ్లు ఉండగా మరో బ్యాగులో ఆమె దుస్తులు ఇతర వస్తువులు కనిపించాయి.

ఆ బ్యాగులు సముద్రంలోనే మునిగిపోయేలా వాటిలో పెద్దమొత్తంలో మెటల్ ప్లేట్లు కూడా కనిపించాయి. దీనినిబట్టి చూస్తే.. హంతకులు ఆమెను హత్య చేసి, ఆ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు ఆమె తల, కాళ్లను బ్యాగుల్లో పెట్టి వాటిని సముద్ర గర్భంలో ముంచేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఆమె శరీర భాగాలను ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించగా అవి అదృశ్యమైన జర్నలిస్ట్ కిమ్‌ వాల్‌వేనని రిపోర్టు వచ్చింది. అంతకుముందు ఆగస్టు 21న తల లేని ఆమె మొండెం మాత్రమే కోపెన్‌ హాగన్‌లోని సముద్రంలో పోలీసులకు లభించింది.

ఇప్పుడు మిగతా శరీర భాగాలను కూడా గాలించి చివరకు అవన్నీ ఆమెవేనని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో పీటర్‌ మ్యాడ్‌సన్‌ను నిందితుడిగా చేర్చారు. కిమ్‌ వాల్‌ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఆమె చేతులు దొరకలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+