ట్రంప్‌పై దాడితో అంటుకున్న అమెరికా: బైడెన్ కీలక ప్రసంగం
US President Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చోటు చేసుకున్న కాల్పుల ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగింది. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తోన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ వ్రే ఓ ప్రకటన విడుదల చేశారు.
త్వరలో ఎన్నికలు..
అమెరికాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కుడి చెవికి బుల్లెట్ తగిలింది. రక్తమోడింది.

జాతిని ఉద్దేశించి..
ఈ ఘటనపై జో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోని ఓవెల్ ఛాంబర్ నుంచి ఆయన ప్రసంగించారు. కాల్పులపై ఎవరికి తోచింది వారు ఊహించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని తేల్చి చెప్పారు. రాజకీయాలను రణక్షేత్రంగా మార్చాలనుకోవడం సరికాదని అన్నారు.
విమర్శల దాడికి దిగొచ్చు..
ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్లు ఈ దాడి అంశాన్ని ప్రస్తావిస్తారని, తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తారనడంలో సందేహాలు అక్కర్లేదని జో బైడెన్ పేర్కొన్నారు. తన ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న కాల్పుల ఘటనలన్నింటినీ గుర్తు చేస్తారని, ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గన్ కల్చర్‌కు ఎలా అడ్డుకట్ట వేస్తారో ప్రచారం చేసుకుంటారని చెప్పారు.
హింస లేని సమాజం..
మరో వారం రోజుల్లో తాను కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తానని, రాజకీయపరమైన విమర్శలను ఎదుర్కొనడానికి, వాటిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని బైడెన్ అన్నారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, హింసకు ఆస్కారం లేని సమాజాన్ని నెలకొల్పడంపైనే ప్రసంగిస్తానని వ్యాఖ్యానించారు.
బ్యాలెట్ ద్వారానే..
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం బ్యాెలట్ బాక్సుల ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని, బుల్లెట్లతో కాదని బైడెన్ పేర్కొన్నారు. అమెరికాను ఎవరు పాలించాలనే విషయాన్ని బ్యాలెట్ బాక్సుల ద్వారా ప్రజలేనని నిర్ధారిస్తారని, బుల్లెట్లతో దాడులు చేసే హంతకులు కాదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications