Pope Francis:ఇకపై మహిళలకు ఆ హక్కు..సంచలన నిర్ణయం తీసుకున్న పోప్ ఫ్రాన్సిస్..!
Pope Francis:రానున్న బిషప్ సమావేశాల్లో మహిళలకు ఓటు హక్కును కల్పించాలని పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే భావనతో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఓటు హక్కుకల్పించడం ద్వారా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని పోప్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు మహిళలకు మరింత నిర్ణయాధికార బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు.
సైనాడ్ ఆఫ్ బిషప్స్‌కు వర్తించే పాలనాపరమైన నిబంధనల్లో చేసిన మార్పులకు పోప్ ఫ్రాన్సిస్ ఆమోదముద్ర వేశారు. ప్రపంచ దేశాల్లోని బిషప్‌లంతా వాటికన్ సిటీలో పలు సమావేశాలకు హాజరవుతారు. ఆ సమయంలో ఈ కొత్త మార్పులకు అధికారిక ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పోప్ ఫ్రాన్సిస్ ఏ అంశాలకైతే ఆమోదం తెలిపారో ఆ అంశాలకు సంబంధించిన జాబితాను వాటికన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించడం ద్వారా వారి బాధ్యతలను పెంచేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకుముందు వాటికన్ చర్చిలో కేవలం పాస్టర్లు, బిషప్‌లు, ఇతర కార్డినల్స్‌కు మాత్రమే అధికారం ఉండేది.
తమకు కూడా సైనాడ్ ఆఫ్ బిషప్స్ సమావేశంలో ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కొన్ని దశాబ్దాలుగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్లను పట్టించుకున్న నాథుడు లేడు. తాజాగా పోప్ ఫ్రాన్సిస్ తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది అక్టోబరులో బిషప్స్ సమావేశం వాటికన్‌లో జరుగుతుంది.
1960లో జరిగిన రెండవ వాటికన్ సమాఖ్య తర్వాత చర్చిని ఆధునీకీకరించారు. ఆ తర్వాత పలు అంశాలపై చర్చించేందుకు కొన్ని వారాల పాటు ప్రపంచ దేశాల్లోని బిషప్స్‌ను రోమ్‌కు పిలిపించి చర్చలు జరిపేవారు. సమావేశం తర్వాత కొన్ని ప్రతిపాదనలపై బిషప్‌లు ఓటు వేయడం జరుగుతుంది. ఓటింగ్ తర్వాత ఆ ప్రతిపాదనలను పోప్ ముందు ఉంచుతారు. వీటిని పరిశీలించిన మీదట పోప్ తన అభిప్రాయం వెల్లడిస్తారు.
ఇప్పటి వరకు ఓటింగ్‌లో కేవలం పురుషులు మాత్రమే పాల్గొనేవారు. అయితే తాజా మార్పులతో ఐదుగురు సిస్టర్లు మరో ఐదుగురు పాస్టర్లతో కలిసి ఓటింగ్ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. మహిళలకు ఓటు హక్కు కల్పించాలన్న పోప్ ఫ్రాన్సిస్ తాజా నిర్ణయంతో అదనంగా 70 మంది నాన్ బిషప్ సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది మహిళలు ఉంటారు. వారికి ఓటు హక్కు ఉంటుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications