ఇరాన్ పై తప్పిన లెక్కలు-ట్రంప్ వన్నీ అబద్ధాలే-జో కెంట్ షాకింగ్..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ఏకపక్షంగా మొదలుపెట్టిన యుద్దాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఉగ్రవాద నిరోధక దళం అధిపతి పదవి నుంచి తప్పుకున్న జో కెంట్ (joe kent)తాజాగా అందుకు దారి తీసిన పరిస్ధితులపై నోరు విప్పారు. మితవాద పోడ్‌కాస్టర్ టక్కర్ కార్ల్‌సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఒత్తిడితో అమెరికా మొదలుపెట్టిన ఈ వార్ ను ఇందులో కెంట్ మరోసారి తీవ్రంగా తప్పుబట్టారు.

ఇరాన్ వార్ పై జో కెంట్ మరో సంచలనం (joe kent)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఉగ్రవాద నిరోధక విభాగాధిపతిగా పనిచేసిన జో కెంట్, ఇరాన్ వివాదంపై తన అభ్యంతరాల కారణంగా పదవికి రాజీనామా చేశారు. ఇరాన్ అణ్వాయుధ ముప్పు గురించి చేసిన వాదనలను ఆయన ఖండించారు. అలాగే ఈ వివాదంలో ఇజ్రాయెల్ పాత్రను విమర్శించారు.తన పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం గురించి బహిరంగంగా మాట్లాడారు.

Post-Resignation Bombshell Joe Kent Claims Iran Nowhere Near Nuclear Weapon

ఇరాన్ కు అణ్వస్త్రం తయారు చేసే సీన్ లేదు

ఈ యుద్ధంపై తనకు ఉన్న ఆందోళనలు, తాజా పరిస్థితిపై ఉన్న బలమైన అభిప్రాయాల కారణంగానే తాను పదవి నుంచి తప్పుకున్నానని జో కెంట్ వివరించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారుచేసే స్థితిలో లేదని కూడా స్పష్టం చేశారు.ప్రస్తుత ఉద్రిక్తతకు ఇజ్రాయెల్ చర్యలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే ఈ పరిణామాలకు కారణమమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్యను తీసుకునే నిర్ణయాన్ని ఇజ్రాయెలీలే నడిపించారు, ఇది అనేక పరిణామాలకు దారితీస్తుందని మాకు తెలుసు, అంటే ఇరానియన్లు ప్రతీకారం తీర్చుకుంటారని కెంట్ తెలిపారు.

Post-Resignation Bombshell Joe Kent Claims Iran Nowhere Near Nuclear Weapon

Take a Poll

ట్రంప్ వ్యాఖ్యలు అబద్ధాలే

ఇరాన్ రెండు వారాల్లో అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడానికి దగ్గరగా ఉందని ట్రంప్ ఇటీవల చెప్పడం, ఫిబ్రవరి 28 దాడులకు ఇది ఒక ముఖ్య కారణమని పేర్కొనడాన్ని కెంట్ ఖండించారు. లేదు, మూడు వారాల క్రితం ఈ సంఘర్షణ ప్రారంభమైనప్పుడు కూడా వారు దగ్గరగా లేరు, జూన్‌లో కూడా లేరు అని ఆయన తేల్చేశారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఇరాన్ దీర్ఘకాలంగా పాటిస్తున్న మతపరమైన శాసనాన్ని (ఫత్వా) ఉల్లంఘించిందని సూచించడానికి ఎలాంటి నిఘా సమాచారం లేదన్నారు. 2004 నుండి ఇరాన్ నాయకత్వం అలాంటి ఆయుధాల అభివృద్ధిని నిషేధించే ఫత్వాను అనుసరిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+